https://oktelugu.com/

Daddy Movie Child Artist: డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Daddy Movie Child Artist: చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం డాడీ. అల్లు అరవింద్ నిర్మాతగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇందులో నటించిన వారికి కూడా మంచి పేరు తెచ్చింది. ఇందులో అల్లు అర్జున్ కూడా ఓ పాత్ర పోషించడం విశేషం. ఇక చిరంజీవికి కూతురుగా నటించిన చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకి చెందిన ఈమె పరిచయస్తుల ద్వారా ఈ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 2, 2022 / 09:00 AM IST
    Follow us on

    Daddy Movie Child Artist: చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం డాడీ. అల్లు అరవింద్ నిర్మాతగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇందులో నటించిన వారికి కూడా మంచి పేరు తెచ్చింది. ఇందులో అల్లు అర్జున్ కూడా ఓ పాత్ర పోషించడం విశేషం. ఇక చిరంజీవికి కూతురుగా నటించిన చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకి చెందిన ఈమె పరిచయస్తుల ద్వారా ఈ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కానీ తరువాత అవకాశాలు వచ్చినా ఆమె చదువు ఆగిపోతోందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆమెను నటన వైపు రానీయలేదు. కానీ ప్రస్తుతం ఆమె పెరిగి పెద్దదై అందంగా తయారయింది.

    Anushka Malhotra

    అనుష్క మల్హోత్రా నటనకు అందరు ఫిదా అయ్యారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిరంజీవితో కలిసి నటించిన ఆమెకు మంచి భవిష్యత్ దొరికినా చదువుకు ఆటంకం కలుగుతుందని భావించి నటనకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ నటన వైపు మళ్లింది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఓ కన్నడ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడి ఆధ్వర్యంలో వచ్చే సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

    Also Read: Senior Heroine Malavika: ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్.. కారణం ఆయనే !

    సినిమా పరిశ్రమలో బాల నటులుగా వచ్చిన వారు చాలా మంది హీరో హీరోయిన్లుగా రాణించారు. వారిలో శ్రీదేవి, మీనా, రాశి, హరీష్, బాలాదిత్య వంటి వారు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిన్ననాడే తన ప్రతిభతో రాణించిన అనుష్క మల్హోత్రా మళ్లీ హీరోయిన్ గా కూడా రాణించాలని తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో అనుష్క అన్ని భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. బాలనటిగానే కాకుండా హీరోయిన్ గా కూడా మంచి పేరు రావాలని ఆశిస్తోంది.

    Anushka Malhotra

    మొత్తానికి అనుష్క మల్హోత్రా తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందాలని భావిస్తోంది. చిన్న నాటి నటిగానే కాకుండా హీరోయిన్ గా తన ప్రస్థానం కొనసాగించాలని కోరుకుంటోంది. ఇక్కడ ఎక్కువగా నటీమణులు తెరపైకి వస్తున్న తరుణంలో అనుష్క కూడా తనదైన శైలిలో రాణించాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆమె ఆశ తీరుతుందా? హీరోయిన్ గా రాణిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. సో బెస్ట్ ఆఫ్ లక్ టు అనుష్క మల్హోత్రా అని ప్రేక్షకులు చెబుతున్నారు.

    Also Read:Hero Nani: ‘హీరో నాని’ కుటుంబం నుంచి మరో హీరో.. ఎవరో తెలుసా ?

    Tags