రైతులకు మద్దతుగా ఇంట్లోనే దీక్ష చేపట్టిన వీహెచ్

రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు గురువారం ఇంట్లోనే దీక్ష చేపట్టారు. ఈమేరకు ఆయన నిన్ననే రైతులకు మద్దతుగా ఒక రోజు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం గాలికొదిలేసిందని […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 1:34 pm
Follow us on


రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు గురువారం ఇంట్లోనే దీక్ష చేపట్టారు. ఈమేరకు ఆయన నిన్ననే రైతులకు మద్దతుగా ఒక రోజు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

4 నుంచి రాష్ట్రానికి కేంద్ర బృందం…!

రైతులకు ఆదుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఆచరణలో మాత్రం ఎక్కడా కన్పించడం లేదన్నారు. ప్రతీగింజను కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఐకేపీ కొనుగోలు సెంటర్లలో ధాన్యం కొనుగోలుకు సరిపడా సదుపాయాల్లేవని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా త్వరితంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా అఖిలపక్షం నేతలు రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్ తో చర్చించినట్లు తెలుస్తోంది.