https://oktelugu.com/

అమెరికా వీసా మరింత కఠినం: హెచ్‌-1బి లాటరీ పద్ధతికి స్వస్తి..!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఇప్పటికే  విదేశీ నిపుణులకు చెక్ పెడుతూ  ట్రంప్ సర్కార్ హెచ్‌-1బీ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా కొందరి విద్యార్థులను అరెస్టు కూడా చేసింది. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు తాజాగా హెచ్‌-1 బి వీసాల మంజూరులో ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయాలనడంతో అమెరికాలో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 4:44 pm
    Follow us on

     H-1B lottery abolished

    అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఇప్పటికే  విదేశీ నిపుణులకు చెక్ పెడుతూ  ట్రంప్ సర్కార్ హెచ్‌-1బీ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా కొందరి విద్యార్థులను అరెస్టు కూడా చేసింది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    తాజాగా హెచ్‌-1 బి వీసాల మంజూరులో ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయాలనడంతో అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులు ఆందోళన చెందుతున్నారు.

    Also Read: భారత బలగాలను చూసి పాక్‌ సైన్యం, అధికారులు వణికిన వేళ..

    పలు దేశాల నుంచి వృత్తి నిపుణులు అమెరికాకు వెళ్లి పనిచేసేందుకు హెచ్‌-1 బి వీసా వీలు కల్పిస్తుంది. ఈ వీసా ద్వారా భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్తారు. వారిలో ఏటా 65 వేల మందికి కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా వీసాలు కల్పిస్తుంటారు. అయితే ఈ విధానం ద్వారా కంపెనీలు తక్కువ వేతనాలకే విదేశీయులను రప్పించుకుంటున్నాయని ట్రంప్‌ సర్కార్‌ ఎన్నో రోజుల నుంచి చెబుతోంది. దీంతో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని అందులో భాగంగా అమెరికా పౌరులకు ఉద్యోగాలు కల్పించడంలో గట్టి చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లాటరీ విధానానిక స్వస్తి చెప్పింది.

    అయితే ఇకపై అమెరికాకు వెళ్లాలంటే వేతనాల ప్రాతిపదికన వీసాలు జారీ చేయనుంది. అత్యధిక వేతనాలున్న నిపుణులకే వీసాలు దక్కేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో అమెరికన్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ట్రంప్‌ చెబుతున్నారు. దీంతో ట్రంప్‌ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా విదేశీయులు ఆందోళన చెందుతున్నారు.

    Also Read: ప్రజలకు అలెర్ట్: సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా

    అమెరికాలో ఎక్కువ శాతం భారతీయ నిపుణులు ఉన్నారు. ఇప్పటి వరకు అమెరికా పౌరసత్వం కలిగితే పర్వాలేదు. కానీ ఇకపై వెళ్లాలంటే మాత్రం లాటరీ పద్దతి కాకండా ప్రత్యేక నిబంధనలు తీసుకోవాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.