చైనాలోని వూహాన్‌లో గతేడాది నవంబర్‌లో పుట్టిన కరోనా వైరస్ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచం మొత్తంలో అమెరికాపై ఈ వైరస్ ప్రభావం బాగా చూపించింది. ఇప్పటి వరకు అమెరికాలో 90 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో ఇండియానే ఉంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
Also Read: భారత బలగాలను చూసి పాక్ సైన్యం, అధికారులు వణికిన వేళ..
తాజాగా బ్రిటన్‌లో మొదటి సారి కంటే రెండోసారే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. లండన్ శాస్త్రవేత్ల ప్రకారం అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ మధ్యలో దేశవ్యాప్తంగా 85 వేల మంది నమునాలు సేకరించారు. ఇందులో ప్రతి పదివేల మందిలో 128 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తేలింది. అక్టోబర్ మొదటివారంలో ఈ సంఖ్య కేవలం 60 మాత్రమే కావడం గమనార్హం.
Also Read: అమెరికా వీసా మరింత కఠినం: హెచ్-1బి లాటరీ పద్ధతికి స్వస్తి..!