తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాతావరణ కాలుష్యం పెరుగుతున్న సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దిగ్గజ ఆటో సంస్థలన్నీ వీటినే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసేవారికి పెద్ద ఎత్తున ప్రయోజనాలను కల్పించాలని సంకల్పించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణలో ఎలక్ట్రికల్ వాహనాల కోనుగోలు చేసేవారికి సబ్సిడీ అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి 2 లక్షల ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాలు, 20 వేల ఆటోలు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ రుసం, రోడ్డు పన్ను పూర్తిగా మినహాయిస్తారు. అలాగే 500 ఎలక్ట్రిక్ బస్సులు, 10 వేల లైట్ వెహికిల్స్‌కు కూడా ఈ మినహాయింపు ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు సైతం ఈ లాభం ఉండబోతుంది.
Also Read: ప్రజలకు అలెర్ట్: సెకండ్ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా
భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల మీదే ఉందని, అందువల్ల ఈ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేలా ఇలాంటి అవకాశం కల్పిస్తుందని మంత్రి కేటిఆర్ ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. రవాణా వ్యవస్థలో ఎక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు కూడా చేపట్టేలా కృషి చేయనున్నారు. ముందుచూపుతో అవకాశాల్ని అందిపుచ్చుకోవడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ చాల చురుగ్గా వ్యవహరిస్తున్నారని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: షాకింగ్ : వేణు మాధవ్ మృతికి పాలిటిక్స్ కారణమా?
ఇక ఆర్టీసీలోనూ ఎలక్ట్రిక్ బస్సులను జీహెచ్‌ఎంసీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే అవి సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో రానురాను ఎలక్ట్రిక్ బస్సులదే పైచేయి అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. ఇక్కడ పూర్తిగా విజయవంతమైతే ఇతర పట్టణాలు, నగరాల్లోనూ ఈ చర్యలు తీసుకోనున్నారు. ఇక ఇతర వాహనాల విషయంలోనూ ఎలక్ట్రిక్ వాటికి ఆఫర్లు ఇతర మినహాయింపులు కూడా ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.