
ప్రపంచ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరోనా వైరస్ ని నియంత్రించే వాక్సిన్ గూర్చి గుడ్ న్యూస్ వినపడుతోంది. అమెరికా శాస్త్రవేత్తలు ఆ వాక్సిన్ ప్రయోగంలో సత్ఫలితాలను చూస్తున్నారు. 43ఏళ్ల జెన్నిఫర్ హాలర్ అనే మహిళ ఈ తొలి ఇంజెక్షన్ తీసుకున్నారు. ఈ ప్రయోగంలో మంచిఫలితాలు రావడంతో కరోనా వైరస్ టీకా మొదటి దశ అధ్యయనం ప్రారంభమైందని సీటిల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు.
“కరోనావైరస్ ను ఎదుర్కోవడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలి” అని కైజర్ పెర్మనెంటె అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా జాక్సన్ అన్నారు.
ఎంఆర్ఎన్ఏ-1273 అని పిలుస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యాక్సీన్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మసాచుసెట్స్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా ఇంక్ సంయుక్తంగా రూపొందించాయి.