America- Pakistan: అగ్రరాజ్యం అమెరికా మరోమారు తన కుటిల నీతిని బయటపెట్టుకుంది. తన వ్యాపారాభివృద్ధి కోసం మన శత్రుదేశం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించేందుకు ముందుకు వచ్చింది. అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలు పాకిస్తాన్‌కు సరఫరా చేయనున్నట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తాజాగా ప్రకటన చేసింది. ఈ డీల్ విలువ రూ.45 కోట్లు డాలర్ల డీల్ కుదిరినట్లు తెలిపింది. ఇది ఇండియాను ఆందోళనకు గురిచేస్తోంది.

40 ఏళ్లుగా పాకిస్తాన్‌కు సహకారం..
భారత్‌కు మిత్రదేశంగా ఉంటున్న అమెరికా 40 ఏళ్లుగా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌కు ఆయుధాలు అందిస్తోంది. వివిధ కారణాలు సాకుగా చూపుతూ అమెరికాకు ఆయుధాలు అందిస్తూ వస్తోంది. యుద్ధ విమానాలే కాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి కూడా అమెరికా సహకారం అందిస్తోంది. ఇందుకోసం అమెరికా ఆంక్షలను కూడా సడలించుకుంటూ వస్తోంది.
Also Read: Jagan- Chandrababu: ఉప్పు నిప్పు ఢీ.. కలవబోతున్న జగన్-చంద్రబాబు.. ఏం జరుగబోతోంది?
1981లో తొలిసారిగా..
పాకిస్తాన్‌కు 1981లో మొట్టమొదటిసారి అమెరికా ఎఫ్–16 యుద్ధ విమానాలను అందించింది. ఇందుకు నాడు అమెరికా ఒక కారణం చూపింది. నాడు ఆఫ్గనిస్తాన్‌లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉంది. సోవియట్ సైన్యం కూడా ఉండేది. ఈ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు, ముజాహిద్‌లకు మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ఈ సమయంలో అమెరికా పాకిస్తాన్‌కు ఎఫ్–16 యుద్ధ విమానాలు సరఫరా చేసింది. వీటిసాయంతో పాకిస్తాన్ సోవియన్ సైన్యాన్ని ఎదుర్కొంది.
1990లో ఆయుధ సరఫరాకు ఆటంకం..
పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడంపై ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. భారత్ కూడా దీనిపై అమెరికాకు తన నిరసన తెలుపుతూ వచ్చింది. ఈ క్రమంలో అమెరికా ఆయుధాల ఆధునికీకరణ, సరఫరాలో ఆటంకం పేరుతో కొంతకాలం ఎఫ్–16 విమానాలతోపాటు ఆయుధాల సరఫరా నిలిపివేసింది. ఆ తర్వాత 2011లో అమెరికా ఆఫ్గన్‌పై యుద్ధం మొదలు పెట్టింది. ఈ సమయంలో పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధాల సరఫరా తిరిగి ప్రారంభించింది. తాలిబాన్లను ఎదుర్కొనేందుకే ఆయుధాలు అందిస్తున్నట్లు అగ్రరాజ్యం చెప్పింది. కానీ తర్వాత పరిణామాలతో అమెరికా ఆఫ్గన్ నుంచి సైన్యం ఉపసంహరించుకుంది. మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు.

ఉగ్రవాదంపై పోరు సాకుతో..
ఆయుధాలను పాకిస్తాన్‌కు సరఫరా చేసే ప్రతీసారి ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకే అని చెబుతున్న అమెరికా.. వాస్తవంగా ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశానికే ఆయుధాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పాకిస్తాన్ అల్‌ఖైదా, జైష్ ఏ మహ్మద్, అనేక రకాల ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు ప్రాణం పోస్తున్నది, నడిపిస్తున్నది పాకిస్తాన్. తాలిబాన్లకు ప్రాణం పోసింది పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పోషిస్తోందని చెబుతున్న అమెరికా ఆయుధాల సరఫరా మాత్రం నిలిపివేయడం లేదు. మరోవైపు అమెరికా ఆయుధాలను పాకిస్తాన్ ఎందుకు ఉపయోగిస్తోంది అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
తీవ్రవాదులు పట్టుబడినా..
ప్రపంచంలో తీవ్రవాదులకు పురిటిగడ్డ పాకిస్తాన్. అల్‌ఖైదా అదినేత ఒసామా బిన్‌లాడెన్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని మిలటరీ హెడ్ క్వార్టర్‌లోనే అమెరికాకు దొరికాడు. ఐదారేళ్లు అక్కడే మకాం వేశాడు. అమెరికా నిఘా వర్గాలు గుర్తించి లాడెన్‌ను అంతం చేశాయి. లాడెన్ తర్వాత అల్‌ఖైదా అధ్యక్షుడైన అల్ జవహరీని కూడా అమెరికా ఇటీవల మట్టుపెట్టింది. ఇతను కూడా పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తాలిబాన్ల రాజ్యం ఆఫ్గన్‌లో పట్టుబడ్డాడు. కాబూల్‌కు సమీపంలో అల్‌జవహరీని పాకిస్తాన్ మట్టుపెట్టింది. ఇంత బహిరంగంగా ఉగ్రసంస్థలకు పాకిస్తాన్ కొమ్ముకాస్తున్నా అమెరికా మాత్రం ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకే తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని చెప్పుకోవడం అమెరికా కుటల నీతికి నిదర్శనం.
Also Read:KCR National Party Announcement: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. కషాయ పాలనపై కేసీఆర్ ఫైట్!