Tasmania Boy: తరాలు మారుతున్నాయి. గుణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో ఉన్న రోజులకు ప్రస్తుత రోజులకు తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్వం రోజుల్లో ఫోన్లు కూడా ఉండేవి కావు. ప్రస్తుతం చిన్న పిల్లల చేతుల్లో సైతం ఫోన్లు ఉండటంతో అద్భుతాలు జరుగుతున్నాయి. ఫోన్లు కొన్ని విషయాల్లో తప్పయినా మరికొన్ని సందర్భాల్లో మంచి జరగడానికి కారణాలు అవుతున్న మాట వాస్తవమే. సమాచార రంగం ఎంతో ప్రగతి సాధించింది. ఇందుకు నిదర్శనమే నేటి సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ఖాతాలు మనుషుల్లో దూరం తగ్గిస్తున్నాయి. ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.

తస్మానియాకు చెందిన ఓ నాలుగేళ్ల బుడతడు తన తల్లిని కాపాడుకున్న ఘటన అందరిలో ముచ్చట గొలుపుతోంది. రాబోయే తరం ఎంత తెలివితో ఉంటారో తెలియజేసేందుకే ఇదే చక్కని ఉదాహరణ. నర్సుగా పనిచేసే ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకుకు ఫోన్ ఎలా అన్ లాక్ తీయాలో ఎమర్జెన్సీలో ఎలా ఫోన్ చేయాలో కూడా నేర్పించింది. దీంతో తన తల్లి మూర్చతో కింద పడిపోవడంతో ఆ నాలుగేళ్ల బుడతడు అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి తన తల్లి పడిపోయిందని కాపాడాలని కోరాడు. దీంతో వారు వచ్చి ఆమెను రక్షించారు.
బాలుడు చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న వయసులో అంతటి తెలివితేటలు ప్రదర్శించిన బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుని ఓ సర్టిఫికెట్ కూడా ప్రదానం చేశారు. నాలుగేళ్ల బాలుడు ఆపద సమయంలో అత్యవసర నెంబర్ 000 కు ఫోన్ చేసి తన తల్లిని రక్షించుకోవడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ అవుతోంది. ఫోన్ ఎలా ఓపెన్ చేయాలో, ఎలా అత్యవసర సేవలకు ఫోన్ చేయాలో ఒక రోజు ముందే అతడి తల్లి బాలుడికి నేర్పించడం కూడా ఓ సుహృద్భావ పరిణామమే.

ఆ బాలుడు హీరో అయిపోయాడు. చిన్న పిల్లాడు అంత పెద్ద పని చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పిల్లాడిని నెటిజన్లు పొగడుతున్నారు. మొత్తానికి చిన్న చాంపియన్ గా మారాడు. తన తల్లికి వచ్చిన ఆపదతో ఎమర్జెన్సీకి ఫోన్ చేసి అతడి తెలివితేటలు ప్రదర్శించడంతో అందరు అవాక్కవుతున్నారు. భవిష్యత్ తరాలు ఎంత తెలివిగా ఉండనున్నారో కూడా ఈ సన్నివేశం చెబుతోంది. బాలుడు చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు. పిల్లల్లో అలాంటి ధైర్యం ఉంటే మంచిదే. విపత్కర సమయాల్లో ఎలా స్పందించాలో కూడా అతడిని చూసి నేర్చుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.