UPSC CSE 2025 Notification 2025 : అభ్యర్థులకు గుడ్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సీర్వస్ ఎగ్జామినేషన్(CSE) 2025 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC CSE 2025 పరీక్షకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
అర్హతలు:
అభ్యర్థి కనీసం బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా విభాగంలో) కలిగి ఉండాలి. చివరి సంవత్సరం బీఈ, బీటెక్ లేదా ఎలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యే అర్హత కలిగి ఉంటారు, కాని ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలి.
వయో పరిమితి
1. సాధారణ కేటగిరీ: కనీసం 21 సంవత్సరాలు, మరియు గరిష్ట వయో పరిమితి 32 సంవత్సరాలు.
2. ఐసీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ:
కనీసం 21 సంవత్సరాలు, మరియు గరిష్ట వయో పరిమితి 37 సంవత్సరాలు.
3. ఓబీసీ కేటగిరీ:
కనీసం 21 సంవత్సరాలు, మరియు గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు.
4. దివ్యాంగులు..
వయో పరిమితిలో కొంత మందికి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
1. సాధారణ, ఓఈసీ అభ్యర్థులు:
దరఖాస్తు ఫీజు రూ.100. (ఇతర క్యాటగిరీలకు పి.ఓ.గ్రేడ్ చేయబడిన అభ్యర్థులకు నేరుగా ఫీజు లేదు)
2. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు
వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎగ్జామినేషన్ ప్రాసెస్:
సివిల్స్ పరీక్ష 3 దశల్లో ఉంటుంది:
ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు(400 మార్కులు) ఉంటాయి. ఈ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఇస్తారు. ఈ ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు.
మెయిన్స్ పరీక్ష: ఈ పరీక్ష డిస్క్రిప్షన్ రూపంలో ఉంటుంది. మెయిన్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం, హైదరాబాద్, వరంగల్. మెయిన్స్ పరీక్ష మాత్రం హైదరాబాద్, విజయవాడలోనే నిర్వహిస్తారు.