Uppala Venkatesh: ఆనందం ఇందులో దొరుకుతుంది? సంతోషం ఎక్కడ లభిస్తుంది? ఆత్మసంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించడం కొంత కష్టమే. అయితే ఒక్కొక్క మనిషికి ఒక్కోవ్యాపకం ఉంటుంది. కొంతమందికి డబ్బు సంపాదించడం ఒక వ్యాపకం. కొంతమందికి దాన్ని ఖర్చు పెట్టడం ఒక వ్యాపకం. అయితే ఆ ఖర్చును సమాజ ఉపయోగానికి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు చరిత్ర పుటలో మనకంటూ ఒక స్థానాన్ని కల్పిస్తాయి. అలా స్థానం సంపాదించుకున్న వాడే ఉప్పల వెంకటేష్.
ఉప్పల వెంకటేష్ పుట్టి పుట్టగానే ఆగర్భ శ్రీమంతుడేమ్ కాదు. కష్టపడి పైకి వచ్చాడు. తనకు ఇష్టమైన రాజకీయాల్లోకి వచ్చాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తలగొండపల్లి జెడ్పిటిసిగా ఎన్నికయ్యాడు. అయితే తాను ప్రతిపక్ష పార్టీ నుంచి జెడ్పిటిసి గా గెలుపొందాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకోని సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. ఉప్పల ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. సమకాలీన రాజకీయాల్లో అందరూ చేసేది ఇదే కాబట్టి ఇక్కడ వెంకటేష్ గొప్ప ఏముంది అని అనుకోవచ్చు.. అతడు కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి.. రేపటినాడు జడ్పిటిసి కంటే పెద్ద పదవి కోసం పోటీ పడతాడు కాబట్టి.. ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. కాకపోతే సేవలు రాజకీయం కోసం వాడుకోవడం వేరు. సేవను సేవలాగా చేయడం వేరు. ఇందులో వెంకటేష్ రెండవ కేటగిరి.. అందుకే అంతటి కేటీఆర్ సైతం స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ద్వారా వెంకటేష్ ను తన వద్దకు రప్పించుకున్నాడు. తన మంచితనం చూసి పార్టీలో రాష్ట్ర నాయకుడి హోదా ఇచ్చాడు. ఒక పార్టీ కండువా మీద గెలిచి మరుసటి నాడు గులాబీ కండువా కప్పుకుంటున్న ఈనాటి రాజకీయాలలో.. వెంకటేష్ దగ్గరికి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వెళ్లడం ఆషామాషి వ్యవహారం కాదు.
ఇక తన మండలంలో తన ఫౌండేషన్ పేరుతో పోలీసు ఉద్యోగాలు ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. వసతి కూడా కల్పించాడు. వారు సాధన చేసేందుకు మైదానం కూడా ఏర్పాటు చేయించాడు. హైదరాబాదులోని నిష్ణాతులైన అధ్యాపకులను తీసుకొచ్చాడు. వారికి లక్షలకు లక్షలు జీతాలు ఇస్తూ అక్కడి పేద యువతకు కోచింగ్ ఇప్పించాడు. వారు జ్ ఎస్సైలుగా ఎంపిక అయ్యారు. ఆ 64 మందిని ఇటీవల వెంకటేష్ తన కార్యాలయానికి పిలిపించుకొని సన్మానించారు. వారికి నగదు పురస్కారాలు కూడా అందించారు. సాధారణంగా డబ్బు అనేది మనిషిని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. పదవి అనేది శిఖరాగ్రాన కూర్చోబెడుతుంది. కానీ ఇవి రెండూ వెంకటేష్ చూశాడు. వీటన్నింటిలో లేని ఆనందాన్ని సేవా మార్గంలో వెతుక్కున్నాడు. తన సేవ సక్రమ మార్గంలో నడిచే విధంగా పేదలకు ఉపయోగపడ్డాడు. ఆ ఫలితమే 64 మంది పేద యువత ఎస్సైలుగా ఎంపిక అవడం. అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు. అది జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంకటేష్ ప్రస్థానం కూడా అలాంటిదే. మొన్న కల్వకుర్తి స్థానంలో ఆయన పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. చివరికి తన స్థానం చేజారిపోతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా భయపడ్డారు. కానీ వెంకటేష్ ముఖంలో ఎటువంటి భయం లేదు. ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఆయన ఫోకస్ మొత్తం యువత మీదే. వారిని ఎలా బాగు చేయాలనే లక్ష్యం మీదే.
View this post on Instagram