Viral Video: సమాజాన్ని సరైన మార్గంలో ేనడిపించాల్సింది గురువులే. ప్రస్తుతం వారే దారి తప్పుతున్నారు. తల్లిదండ్రుల తువాత గురువుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాం. వారికి గౌరవర్యాదలు కూడా ఎక్కువే. కానీ వారి నడత అడ్డంగా వెళ్తోంది. సమాజానని మార్చాల్సిన వారే మారిపోతున్నారు. గురువు అనే పదానికి అర్థం మరిపోయేలా చేస్తున్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉంటూ పనికే కళంకం తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారితోనే సేవలు చేయించుకోవడం చర్చనీయాంశం అవుతోంది. సమాజానికి దారి చూాల్సిన వారే అడ్డదారిలో వెళతే సమాజం ఏమవుతుంి. ఎక్కడకు పోతోంది. భవిష్యత్ తరాలకు ఏం చెబుతోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని పోఖారీ ప్రాథమిక పాఠశాలలో ఊర్మిళా సింగ్ అనే మహిళా ఉపాధ్యాయురాలు పనిచేస్తోంది. ఆమె పాఠాలు చెప్పకుండా పిల్లలతో సేవలు చేయించుకుంటోంది. పిల్లలతో చేతులకు మసాజ్ చేయించుకుంటోంది. వారికి సేవలు చేయాల్సిన టీచర్ వారితోనే చేతులు పట్టించుకోవడంతో దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు ఇలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతటి దారుణమైన ఘటనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
సదరు టీచర్ ప్రవర్తన కూడా బాగుండదని తెలుస్తోంది. ఎప్పుడు తరగతులకు వెళ్లకుండా కాలయాపన చేస్తుందని అదేంటంటే మాపైనే చిందులేస్తుందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఆమె ప్రవర్తన బాగా లేదని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దేశంలో ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతుంటే ఉద్యోగాలు చేసే వారేమో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమెను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి.
తోటి ఉపాధ్యాయులతో కూడా గొడవ పడుతుంటుంది. పిల్లలతో సపర్యలు చేయించుకుంటుంది. తన వ్యక్తిగత పనులు చేయించుకోవడంతో అందరికి ఆగ్రహం పెరిగింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ వారితో చేతులు పట్టించుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వృత్తికే అవమానం చేస్తున్న ఆమెను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని పలువురు కోరుతున్నారు. పిల్లలను అపురూపంగా చూసుకోవాల్సిన టీచర్ గతి తప్పి ప్రవర్తించడం సమంజసం కాదు. అందుకే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజాసంఘాలు డిమాండ్ చేయడం గమనార్హం.
https://twitter.com/GradingNews/status/1552286155755835394?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1552286155755835394%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Futtar-pradesh%2Fup-teacher-suspended-after-video-goes-viral-of-student-massaging-her-in-classroom-5538790%2F