Unstoppable With NBK- Nara Lokesh: ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాం వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. సీజన్ – 1లో సినిమా హీరోలతో షోలు చేసిన బాలయ్య సీజన్ – 2లో రాజకీయ నాయకులతో షో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్ షో తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌తో చేశారు. అక్టోబర్ 14 నుంచి సీజన్ – 2 మొదలు కాబోతోంది. దానికి సబంధించిన ప్రోమోలో బాలయ్య అటు బావను.. ఇటు అల్లుడిని చెడుగుడు ఆడారు.

మరోకోణం బయటపెట్టిన బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేసిన అన్ స్టాపబుల్ షో సూపర్ క్లిక్ అయింది. బాలయ్యలోని మరో కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించినట్టు అయింది. దీంతో బాలయ్య మీద అందరికీ మరింత ప్రేమ పెరిగింది. బాలయ్యలోని చిలిపి, చలాకీ, కలివిడి కోణాన్ని చూపించేశారు. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. రెండో సీజన్‌ను భారీ ఎత్తులో ప్లాన్ చేశారు నిర్వాహకులు. అందుకే రెండో సీజన్లోని మొదటి ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
బావ, అల్లుడితి ఫస్ట్ షో...
అన్ స్టాపబుల్ సీజన్–2 ఫస్ట్ షోకు బాలయ్య తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌ను తీసుకొచ్చాడు. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు నా బంధువుని తీసుకొద్దామని అనుకున్నా.. కానీ ప్రజల బంధువుని తీసుకొస్తే బెటర్ అనిపించింది.. మీ అందరికీ బాబు.. నాకు బావ అంటూ చంద్రబాబు గురించి బాలయ్య అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చారు. తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని బాలయ్య సరదాగా అనడం.. వసుంధరకు ఫోన్ చేస్తాను అని బాబు ఫోన్ తీయడం సరదాగా సాగింది. ఇక ఇలా సరదాగా సాగుతున్న ప్రోమోలో సీరియస్ అంశాలను కూడా జోడించారు. షోలో బాలయ్య వెన్నుపోటు అంశాన్ని కూడా ప్రస్తావించారు. 1995లో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నానని, అది తప్పు నిర్ణయమా? అని బాలయ్యను సూటిగా అడిగేశాడు బాబు. నాటి సంఘటనలను బాబు గుర్తు చేసుకున్నాడు.
బెస్ట్ ఫ్రెండ్ వైఎస్సార్..
తనకు అత్యంత ఆప్త మిత్రుడు వైఎస్సార్ అని చంద్రబాబు ఈ షోలో చెప్పుకొచ్చాడు. నువ్ సినిమాల్లో చిలిపి పనులు చేస్తే మేం కాలేజీల్లో చేశామంటూ బాబు తన రోజులను గుర్తు చేసుకున్నాడు.

లోకేష్ రొమాంటిక్ ఫొటోలు..
ఇక నారా లోకేష్ ఎంట్రీతో ఇంకాస్త సరదాగా సాగింది ప్రోమో. బాలయ్య, చంద్రబాబును కలిపి నారా లోకేష్ ప్రశ్నలు అడిగాడు. కాసేపు హోస్ట్‌గా మారిన లోకేష్.. బాబు, బాలయ్య పర్సనల్ విషయాలను కూపీ లాగే ప్రయత్నంచేశాడు. ఇంట్లో భార్యకు ఎవరు బాగా భయపడతారు.. వంటలు ఎవరు చేస్తారంటూ ఇలా పర్సనల్ ప్రశ్నలు వదిలాడు లోకేష్. అలాగే నారా లోకేష్‌కు సంబంధించిన చిన్నప్పటి విషయాల గురించి కూడా బాలయ్య మాట్లాడారు. ఏది పట్టుకుంటే అది నాది అనేవాడు మూట కట్టి బయటపడేస్తాను అని అనేవాడిని. ఇక ఆ తర్వాత నారా బ్రాహ్మణిని తన దాన్ని చేసేసుకున్నాడు అని బాలయ్య అన్నాడు. ఇక నారా లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిల తో కలిసి ఉన్న ఫొటో చూపించిన బాలయ్య అసెంబ్లీ దాక వెళ్లింది ఆ ఫోటో అని అన్నారు. ఇక బాలయ్య బాబు చంద్రబాబు నాయుడిని కూడా ఆ ఫోటో గురించి స్పందన ఏమిటి అడిగినప్పుడు.. మామకు లేని సందేహం నాకు ఎందుకు అని అన్నారు చంద్రబాబు.
1000 కోట్ల టర్నోవర్
అలాగే రాళ్లు రప్పలు ఉన్నదాన్ని ఇప్పుడు మహానగరంగా మార్చిన ఘనత మీదే అని ఇప్పుడు అది 1000 కోట్ల టర్నోవర్‌గా మారిన సైబరాబాద్ అని బాలయ్య బాబు చెప్పారు. అంతేకాకుండా అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి గ్రాఫిక్స్ అనలేదు అని సెటైర్ కూడా వేశారు. మొత్తంగా సరదాగా సాగిన షో ప్రోమోనే ఆకట్టుకునేలా ఉంది. పూర్తి వివరాలు చూసి ఎంజాయ్ చేయాలంటే ఈనెల 14న ఎపిసోడ్ చూడాల్సిందే.