YCP Alliance With BRS: ఏపీలో బీఆర్ఎస్, వైసీపీ మధ్య పొత్తు కుదురుతుందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ప్రధాంగా ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలో విస్తరించే పనిలో పడ్డారు. అయితే మిగతా రాష్ట్రాల కంటే ఏపీ సేఫ్ జోన్ గా భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జగన్ సర్కారు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు టీడీపీ, జనసేనలు కలిసే చాన్స్ ఉంది. ప్రజావ్యతిరేక ఓటు చీలినివ్వనని పవన్ పదేపదే చెప్పడం ద్వారా తాను ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదుర్చుకుంటానని చెప్పకనే చెప్పారు. అటు చంద్రబాబు కూడా పొత్తకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సహజంగా ఇది వైసీపీకి కలవరపాటుకు గురిచేసే అంశమే.

అయితే తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ఎంట్రీతో వైసీపీలో స్ట్రాటజీ మారింది. అటు హైదరాబాద్ లో సెటిలర్స్, ఇటు కుల రాజకీయాలను అడ్డంపెట్టుకొని ఏపీలో విస్తరించాలని కేసీఆర్ చూస్తున్నారు.ఒక వేళ కేసీఆర్ పోటీచేస్తే మాత్రం ఏపీ బ్యాలెట్ పై మరో పార్టీ గర్తు వచ్చి పడే అవకాశముంది. ప్రజా వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు వెళ్లే అవకాశముంది. ఏపీలో కేసీఆర్ ను వ్యతిరేకించే వారు ఎంతమంది ఉన్నారో.. అభిమానించే వారు కూడా ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ వైపు కన్వర్టు అయ్యే అవకాశముంది. అటు సెటిలర్స్ కూడా నయానో..భయానో బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతారని వైసీపీ అంచనా వేస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్ నేరుగా వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. కానీ దానికి జగన్ అంగీకరించడం లేదు. అయితే ఇక్కడ కూడా కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు దిగే అవకాశముంది. జగన్ కు వ్యక్తిగతంగా హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను బూచీగా చూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కనీసం నేరుగా పొత్తు కాకున్నా.. బీఆర్ఎస్ పోటీచేసే చోట అంతర్గతంగా సపోర్టు చేయించే అవకాశముంది. వైసీపీ తరుపున బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టే చాన్స్ ఉంది. ఇలాదాదాపు 45 అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్ టార్గెట్ పెట్టుకున్నారు. వర్కవుట్ చేసే పనిలో పడ్డారు.