Union Minister Nirmala Sitharaman- Grandhi Srinivas: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోంది.. సంక్షేమ పధకాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిన వైసీపీ సర్కార్ పై ప్రతిపక్షాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి..ఈ వ్యతిరేకతని పసిగట్టిన ముఖ్యమంత్రి జగన్ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఇంటి ఇంటికి తిరిగి జానాల సమస్యలను కనుక్కొని తీర్చాలి అంటూ ఆదేశాలు జారీ చేసాడు..కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేపట్టారు.

కానీ అలా జనాల ఇళ్ళకి వెళ్లిన ఎమ్మెల్యేలకు, ఎంపీ లకు జనాలు చుక్కలు చూపించారు..నిరసన జ్వాలలతో హోరెత్తించారు..దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి..ఆ దెబ్బకి మళ్ళీ వీళ్ళు జనాల మధ్యలోకి వెళ్ళడానికి భయపడ్డారు..ఇక ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కూడా విరుచుకుపడ్డారు..మీడియా ముఖంగానే వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసి పరువు తీశారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మన అందరికి గుర్తు ఉండే ఉంటాడు..ఇతగాడు 2019 ఎన్నికలలో భీమవరం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గెలిచాడు..ఆయన గెలుపు వెనుక అప్పట్లో అనేక ఆరోపణలు ఉండేవి..ముందుగా పవన్ కళ్యాణ్ గెలిచాడు అని అధికారికంగా ప్రకటించిన తర్వాత రీ కౌంటింగ్ జరిపించి.. గ్యాంబ్లింగ్ చేసి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

అవన్నీ పక్కన పెడితే ఈరోజు నిర్మల సీతారామన్ భీమవరం జనాలతో మీడియా ముందు మాట్లాడుతూ ‘నేను 2019 ఎన్నికల ముందే మీ ఆరు గ్రామాల సమస్యని పరిష్కరించడానికి నేను నిధులు విడుదల చేశాను..నేను రెండు సార్లు ఎంపీ అయ్యాను..ఇప్పుడు కర్ణాటక కి కూడా మారిపోయాను..కానీ ఆ నిధుల లెక్క ఏమైందో..మీ సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉన్నాయో..ఇదిగో ఇక్కడే నిల్చున్న మీ ఎమ్మెల్యే గారు గ్రంధి శ్రీనివాస్ నే అడగాలి..మీలో చైతన్యం రావాలి ..ఇలాంటోళ్లని నిలదీయాలి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. మీడియా ముందే వైసీపీ ఎమ్మెల్యే పరువు తీసిన కేంద్ర మంత్రి నిర్మల తీరు వైసీపీ పరువు పోయేలా ఉంది. .
భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ గారికి ఇంద మాదిరి ఓరు రాడ్డు 💥😂
pic.twitter.com/UAWdOIAT1J— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) October 27, 2022