Nirmala Sitharaman : ఇదేందయ్యా ఇదీ! మోడీ ఫొటో కోసం నిర్మల.. కేసీఆర్ ఫొటో కోసం హరీష్..

Nirmala Sitharaman : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలుదువ్విన కేసీఆర్ ను టార్గెట్ చేసిన బీజేపీ పెద్దలు ఇక్కడ కేసీఆర్ అసలు రంగును బయటపెట్టడానికి కదిలివస్తున్నాయి. దేశానికి ఆర్థిక మంత్రి అయిన మన తెలుగింటి ఆడకోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రేషన్ షాపుల్లో మోడీ ఫొటోలు లేకపోవడంపై నొచ్చుకున్నారు. కామారెడ్డి కలెక్టర్ పై చిందులు తొక్కారు. అంతేకాదు.. పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యానికి ఖర్చు 35 రూపాయలు అవుతోందని.. […]

Written By: NARESH, Updated On : September 2, 2022 4:25 pm
Follow us on

Nirmala Sitharaman : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలుదువ్విన కేసీఆర్ ను టార్గెట్ చేసిన బీజేపీ పెద్దలు ఇక్కడ కేసీఆర్ అసలు రంగును బయటపెట్టడానికి కదిలివస్తున్నాయి. దేశానికి ఆర్థిక మంత్రి అయిన మన తెలుగింటి ఆడకోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రేషన్ షాపుల్లో మోడీ ఫొటోలు లేకపోవడంపై నొచ్చుకున్నారు. కామారెడ్డి కలెక్టర్ పై చిందులు తొక్కారు.

అంతేకాదు.. పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యానికి ఖర్చు 35 రూపాయలు అవుతోందని.. దానిలో కేంద్రం భరించేది ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తోందని నిర్మల లాజిక్ ప్రశ్న వేశారు. దీనికి కామారెడ్డి కలెక్టర్ తెలియదంటూ సమాధానమిచ్చారు.దీంతో అసహనానికి గురైన నిర్మల అరగంటలో తనకు తెలుసుకొని చెప్పాలంటూ హెచ్చరికలు పంపారు. అంతేకాదు.. రేషన్ షాపుల్లో మోడీ ఫొటోలు ఎందుకు పెట్టలేదని.. మీరు పెడుతారా? నేనే తెచ్చి పెట్టాలా? అంటూ కలెక్టర్ పై సీరియస్ అయ్యారు.

ఎంత మోడీపై అభిమానమున్నా.. బీజేపీ సర్కార్ ఫ్రీ రేషన్ ఇస్తున్నా కానీ వాటి పంపిణీలో కీలక బాధ్యత వహించే కలెక్టర్లను ఇలా అవమానించడం ఏమాత్రం సభ్యత కాదని పలువురు నిర్మలకు హితవు పలుకుతున్నారు. రేషన్ వచ్చిందా? పేదలకు కరెక్ట్ గా సరఫరా చేశారా? అన్నది మాత్రమే కలెక్టర్లు చూస్తారు.. పర్యవేక్షిస్తారు. కిలో బియ్యంలో కేంద్రం ఎంత ఇచ్చింది. రాష్ట్రం ఎంత ఇచ్చిందన్నది కొలవరు. ఆ లెక్కలన్నీ రాజకీయ కోణంలోనివే. తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేసి.. కేంద్రం ఏం ఇవ్వడం లేదన్న కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలనుకున్న నిర్మల కలెక్టర్ ను బలిపశువును చేయడం ఏంటో అర్థం కాని పరిస్థితి.. కలెక్టర్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలో కేంద్రమంత్రి నిర్మల వ్యవహరించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనికి వెంటనే హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు.. కేంద్ర మంత్రి నిర్మల రేషన్ దుకాణంలో మోడీ ఫొటో పెట్టాలనడంపై మండిపడ్డారు. ‘దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని.. తెలంగాణ నుంచి కేంద్రం 3.65 లక్షల కోట్లను పన్నుల రూపంలో తీసుకుంటోంది. కేంద్రం నుంచి వచ్చేది అందులో సగం కంటే తక్కువ. మరి దేశాన్ని సాకుతున్న తెలంగాణ తరుఫున కేసీఆర్ ఫొటో కూడా మీరు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకునేందుకు నిర్మల ఏకంగా కలెక్టర్ ను బలి చేసింది. ఇక కేంద్రం ఏం ఇవ్వడం లేదని.. గొప్పలు చెప్పుకుంటోందని టీఆర్ఎస్ బీరాలకు పోయింది. మొత్తం ఈ రాజకీయంలో కలెక్టర్, ప్రజలే వెర్రిపుష్పాలుగా మారిపోయారు. మీ రాజకీయం ఉంటే బయట చూసుకోవాలని.. ఇలా కలెక్టర్ల వద్ద.. రేషన్ షాపుల వద్ద రాజకీయం చేయవద్దని పలువురు హితవు పలుకుతున్నారు. మోడీ ఫొటో లేదని నిర్మల గాయి చేసిన తీరు.. ఇక కేసీఆర్ ఫొటో పెట్టాలని హరీష్ అందుకున్న తీరును చూసి జనాలు విస్తుపోతున్నారు. మీ రాజకీయాలకు పథకాల పేరుతో ప్రజలను పిచ్చోళ్లను చేయవద్దని అభిప్రాయపడుతున్నారు.