Homeజాతీయ వార్తలుUniform Civil Code India: యూనిఫాం సివిల్‌ కోడ్‌.. ఒక్కో రాష్ట్రంలో అమలులోకి..!

Uniform Civil Code India: యూనిఫాం సివిల్‌ కోడ్‌.. ఒక్కో రాష్ట్రంలో అమలులోకి..!

Uniform Civil Code India: యూనిఫాం సివిల్‌ కోడ్‌.. ఉమ్మడి పౌరసత్వ చట్టం.. పేరు ఏదైనా.. భారత్‌లో పుట్టిన వారికే భారత పౌరసత్వం ఉండాలి.. అందరికీ ఒకే చట్టం వర్తించాలని అనే లక్ష్యంతో కేంద్రం నాలుగేళ్ల క్రితం ఈమేరకు చట్టం చేసింది. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ముస్లిం అనుకూల పార్టీలు దేశవ్యాప్తగా అల్లర్లు చేసే ప్రయత్నం చేశాయి. దీంతో దీని అమలు వాయిదా పడింది. అయితే కేంద్రం దీనిని మొదట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం మొదలు పెట్టింది. ఉత్తరాఖండ్‌లో ఏడాదిగా కామన్‌ సివిల్‌కోడ్‌ అమలులోకి వచ్చింది. ఇక్కడ ముస్లిం సమాజం సహా అన్ని వర్గాలు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించాయి. పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రభుత్వం జాగ్రత్తలతో అమలు చేసి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకుంది.

గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లో సన్నాహాలు..
గుజరాత్‌ కేబినెట్‌ కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ కేబినెట్‌ ్ఖఇఇ అమలుకు హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది. గిరిజనులకు 5, 6వ షెడ్యూల్‌ చట్టాలు ఉన్నాయి. వాటికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గోవాలో 400 ఏళ్లుగా కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలులో ఉంది. అక్కడ ఎలాంటి సమస్యలు లేవు.

రాజ్యాంగంలో ఉన్నా అమలులో జాప్యం..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 ప్రకారం, యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లుగా ఈ స్పష్టమైన రాజ్యాంగ ఆదేశాన్ని అమలు చేయలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు దీన్ని మొదలుపెట్టాయి. హడావుడి లేకుండా, మార్పులు చేర్పులతో అమలు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అస్సాంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలు చేస్తామని ప్రకటించారు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అస్సాంలో అమలైతే ఐదో రాష్ట్రం అవుతుంది.

రాజ్యాంగ ఆర్టికల్‌ 44 స్పష్ట ఆదేశాన్ని 70 ఏళ్ల తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. గోవా, ఉత్తరాఖండ్‌లో విజయవంతమైన అమలు తర్వాత వివాదాలు తగ్గాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, అస్సాం వరుసగా మొదలుపెడుతున్నాయి. జాగ్రత్తలతో, మార్పులతో అమలు చేస్తూ సామాజిక సామరస్యాన్ని కాపాడుకుంటున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version