Andhra Pradesh Delimitation: డీ లిమిటేషన్ బిల్లు పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విపక్షాల అభ్యంతరాలపై ఫుల్ క్లారిటీ ఇస్తోంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్న ప్రచారంలో నిజం లేదని చెబుతోంది. మరోవైపు 50% నియోజకవర్గాల పెంపుపై కూడా ఫుల్ క్లారిటీ ఇస్తోంది. పునర్విభజనలో భాగంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 పార్లమెంట్ స్థానాలు.. 38 కి పెరగడం ఖాయమని తెలుస్తోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్లమెంట్ నియోజకవర్గం జారీచేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా ఏర్పడనున్న ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ అనేది క్లారిటీ వస్తోంది. అయితే ప్రధానంగా అమరావతి రాజధాని పేరుతో ఒక పార్లమెంట్ సీటు వస్తుందని తెలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఉన్న పార్లమెంటు స్థానాలు కొన్ని రద్దయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
* 50 శాతం పెరుగుదల..
కచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల్లో 50% పెరుగనున్నాయి. ఏపీలో సగటున ఒక్కో లోక్సభ నియోజకవర్గ జనాభా 13.02 లక్షలు కానుంది. ప్రస్తుతం కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో జనాభా 20 లక్షలకు పైగా ఉంది. గతంలో లోక్సభ నియోజకవర్గ కేంద్రాలుగా వెలిగిన తెనాలి, గుడివాడ, మార్కాపురం, బొబ్బిలి వంటి స్థానాలు తిరిగి ఏర్పడే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన చేస్తే ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో సగటున 13.2 లక్షల మంది జనాభా ఉంటారు. తిరుపతి, ఒంగోలు,గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో ఎంపి స్థానం పెరగనుంది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
* పాత నియోజకవర్గాల పునరుద్ధరణ..
మరోవైపు దశాబ్దాల కిందటే ఏర్పాటు అయిన నియోజకవర్గాలే మళ్లీ పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెనుకొండ,కావలి, మార్కాపురం, ఆదోని కేంద్రాలుగా లోక్సభ నియోజకవర్గాలు ఉండేవి. తాజాగా చేపట్టబోయే పునర్విభజనలు బొబ్బిలి, తెనాలి తిరిగి పరిశీలించే అవకాశాలు స్పష్టం. అదే సమయంలో రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఒక పార్లమెంట్ సీటు రావడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల, గుంటూరు, నరసరావుపేట ఎంపీ స్థానాలు ఉండగా మరో సీటు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అదే అమరావతి అన్నట్టు తెలుస్తోంది.
* తెలంగాణలో పెరిగిన సీట్లు..
2009లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో తెలంగాణలో సీట్లు పెరిగాయి. ఏపీలో తగ్గాయి. కానీ ఈసారి ప్రతి రాష్ట్రంలో 50% నియోజకవర్గాలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు 263 పెరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి 25 నుంచి 38 కి పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంట్ సీట్లు ఉండేవి. తెలంగాణలో 17 కొనసాగుతుండగా మరో 8కి పెరుగుతాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 63 పార్లమెంటు స్థానాలు ఉండనున్నాయి. ఎన్డీఏ పరంగా ఈ సీట్లని దక్కించుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే. అందుకే దక్షిణాది రాష్ట్రాల కు ఇబ్బందికరం అని పేరు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్.