https://oktelugu.com/

ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి

లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి అందించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌‌ గాంగ్వార్‌‌ అధ్యక్షతన జరిగిన ఈఎస్‌ఐసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అటల్‌ బీమిత్‌ కల్యాణ్‌ యోజన స్కీం కింద ఈ సాయం అందించనున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 12:04 PM IST
    Follow us on

    లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి అందించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌‌ గాంగ్వార్‌‌ అధ్యక్షతన జరిగిన ఈఎస్‌ఐసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అటల్‌ బీమిత్‌ కల్యాణ్‌ యోజన స్కీం కింద ఈ సాయం అందించనున్నారు.

    Also Read: దేవుడా… కరోనా వ్యాక్సిన్ కోసం అప్పటివరకు ఎదురు చూడాలా…?

    కరోనా కాటుతో చాలా కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రైవేటు రంగాలు చాలా వరకు తమ భారాన్ని తగ్గించుకోవాలని చూశాయి. దీంతో చాలా మందిని తీసేశారు. ఇంకొంత మందికి జీతాల్లో కోత విధించారు. సాఫ్ట్‌వేర్‌‌ కంపెనీలు, ఖార్ఖానాలు అని సంబంధం లేకుండా చివరికి మీడియా హౌస్‌ల నుంచి చాలా మందిని గెంటేశారు. దీంతో కరోనా కాలంలో వారందరూ ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    ఉద్యోగాలు కోల్పోయిన వారు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించాలి. లేకున్నా ఆన్‌లైన్‌లో కానీ, పోస్టులో కానీ దరఖాస్తులు పంపించొచ్చు. దరఖాస్తుతోపాటు ఆధార్‌‌, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను అటాచ్‌ చేయాల్సి ఉంది. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ స్కీం ఏడాదిపాటు అందుబాటులో ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇచ్చినా.. అది 25 శాతమే చెల్లించామని తెలిపింది. తాజాగా 50 శాతానికి పెంచినట్లు చెప్పారు.

    Also Read: సినీ సెలబ్రెటీలకు వారి నుంచే డ్రగ్స్?

    అలాగే ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా రూల్స్‌ను మరింత ఈజీ చేశారు. గతంలో సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తు పంపించే వెసులుబాటు ఉండేదని.. ఇప్పుడు స్వయంగా కార్మికులే ఇచ్చేలా నిబంధనలు సడలించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత నిరుద్యోగ భృతి కార్మికుల బ్యాంకు ఖాతాలోనే జమ కానున్నట్లు కార్మిక శాఖ చెప్పింది.