అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి:పవన్

కర్ణాటక తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వర్గాల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించినట్టు ఏపీలో కూడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని పవన్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కోరారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారని, వారికి ఆర్థికపరమైన ఉపశమనం […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 6:46 pm
Follow us on

కర్ణాటక తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వర్గాల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించినట్టు ఏపీలో కూడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని పవన్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కోరారు.

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారని, వారికి ఆర్థికపరమైన ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ కూలీలు, హమాలీలు, కులవృత్తులు చేసుకునే బార్బర్లు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రికల్ పనులు చేసుకునేవారు, తోపుడు బండ్ల వారు, టిఫిన్ సెంటర్ల వారు ఆర్థికంగా దెబ్బతిన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వారికి ఒక్కొక్కరికి రూ.5వేల తక్కువ కాకుండా సాయం చేయాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం రూ.1610 కోట్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఏపీలో కూడా అలాంటి నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి కోల్పోయిన వారిని ఆ ప్రత్యేక నిధి ద్వారా సాయం చేయాలన్నారు. అదే విధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ బిల్లు విషయంలో కొన్ని నెలల పాటు రాయితీలు ఇవ్వాలన్నారు. ఆస్తి, వృత్తి పన్నుల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.