Aadhar: పిల్లల ఆధార్ కోసం ఆపసోపాలు పడుతున్న వారికి శుభవార్త. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా తాత్కాలికంగా ఒక ఆధార్ నంబర్‌ను కేటాయించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) భావిస్తోంది. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో తొలిసారి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ప్రభుత్వ సిబ్బందే పిల్లల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్స్ సేకరిస్తారు. అదే సమయంలో శాశ్వత ఆధార్ నంబరును కూడా కేటాయిస్తారు. అనంతరం 18 ఏళ్లు నిండి మేజర్ అయ్యాక మళ్లీ బయోమెట్రిక్ డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ వివరాలు శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సంబంధిత కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక భద్రతను కల్పించే పథకాల పరిధిలోకి ప్రతి ఒక్కరినీ తీసుకురావడం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే శిశువులకూ ఆధార్ నంబర్‌ను కేటాయించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2010లో ప్రారంభమైన ఆధార్ ప్రా జెక్టు ద్వారా దేశంలోని వయోజనులందరికీ ఆధార్ నంబర్లను కేటాయించారు. ఆధా ర్ పొందినవారిలో 5-18 ఏళ్ల మధ్య వయసున్నవారే 93ు మంది ఉన్నట్టు అం చనా. ఐదేళ్లలోపు పిల్లల్లో నాలుగోవంతు మందికే ఆధార్ కార్డులున్నాయి. అప్పుడే పుట్టిన శిశువులకు తాత్కాలిక నంబరును కేటాయించవచ్చని తొలి నుంచీ మార్గదర్శకాల్లో ఉందని యూఐడీఏఐ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ పాల్ తెలిపారు.
మరణాల రికార్డులను ఆధార్ నంబర్లతో లింక్ చేయడం… యూఐడీఏఐ రెండో ప్రతిపాదన. చనిపోయినవారి ఆధార్ నంబర్లను ఉపయోగించి ఇతరులు ప్రయోజనాలు పొందుతున్నట్టు యూఐడీఏఐ గుర్తించింది. కొవిడ్ కారణంగా చనిపోయినవారి ఆధార్ నంబర్లను ఉపయోగించి ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేయ డం పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చనిపోయినవారి ఆధార్ నం బర్లు యాక్టివేషన్‌లోనే ఉండటంతో చాలామందికి పెన్షన్లు ఇంకా అకౌంట్లలో పడుతున్నాయని, ఆ సొమ్మును ఇతరులు వాడుకుంటున్నారని సంబంధిత వర్గాలు అం చనా వేస్తున్నాయి. దీన్ని నివారించడానికి క్షేత్రస్థాయిలో నమోదుచేసే మరణాల వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానిస్తారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సంభవించే మరణాలనూ ఆధార్‌తో లింక్ చేస్తారు. మరణించినవారి ఆధార్ ను డీయాక్టివేట్ చేసి, పథకాలు దుర్వినియోగం కాకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ రెండు ప్రతిపాదనల పైలట్ ప్రాజెక్టులు త్వరలోనే ఆరంభం కానున్నాయి.
Also Read: Presidential elections 2022: విపక్షాలకు చిక్కని రాష్ట్రపతి అభ్యర్థి.. ఫలవంతం కాని తొలి భేటీ
ఎలాంటి ఐడీ ప్రూఫ్‌లు లేనివారికి ‘జీరో ఆధార్’ను కేటాయించాలని యూఐడీఏఐ ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం… బర్త్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్, ఇతర ఐడీ కార్డులు ఏవీ లేకపోయినా ఆధార్ ఇస్తారు. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు వారి తరఫున ఎలకా్ట్రనిక్ సంతకం చేయాల్సి ఉంటుంది. అలా సంతకం చేసినవారి సమాచారమూ రికార్డుల్లో నమోదవుతుంది. తద్వారా ఒకరికి మించి ఎక్కువమంది కి సంతకం చేయకుండా నియంత్రిస్తారు. ఇక నాలుగో ప్రతిపాదన ప్రకారం.. ఆఽ దార్‌ను డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు తదితర ఐడీ ప్రూఫ్‌లతో క్రాస్ చెక్ చేస్తారు. దీనికోసం డిజిలాకర్ నుంచి ఆయా ప్రూఫ్‌ల వివరాలను సేకరిస్తారు. ఆ ధార్ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ ప్రతిపాదనల ఉద్దేశమని ఓ అధికారి తెలిపారు.
పిల్లల ఆధార్ కోసం ఆపసోపాలు పడుతున్న వారికి శుభవార్త. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా తాత్కాలికంగా ఒక ఆధార్ నంబర్‌ను కేటాయించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) భావిస్తోంది. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో తొలిసారి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ప్రభుత్వ సిబ్బందే పిల్లల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్స్ సేకరిస్తారు. అదే సమయంలో శాశ్వత ఆధార్ నంబరును కూడా కేటాయిస్తారు. అనంతరం 18 ఏళ్లు నిండి మేజర్ అయ్యాక మళ్లీ బయోమెట్రిక్ డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ వివరాలు శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సంబంధిత కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక భద్రతను కల్పించే పథకాల పరిధిలోకి ప్రతి ఒక్కరినీ తీసుకురావడం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే శిశువులకూ ఆధార్ నంబర్‌ను కేటాయించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2010లో ప్రారంభమైన ఆధార్ ప్రా జెక్టు ద్వారా దేశంలోని వయోజనులందరికీ ఆధార్ నంబర్లను కేటాయించారు. ఆధా ర్ పొందినవారిలో 5-18 ఏళ్ల మధ్య వయసున్నవారే 93ు మంది ఉన్నట్టు అం చనా. ఐదేళ్లలోపు పిల్లల్లో నాలుగోవంతు మందికే ఆధార్ కార్డులున్నాయి. అప్పుడే పుట్టిన శిశువులకు తాత్కాలిక నంబరును కేటాయించవచ్చని తొలి నుంచీ మార్గదర్శకాల్లో ఉందని యూఐడీఏఐ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ పాల్ తెలిపారు.
మరణాల రికార్డులను ఆధార్ నంబర్లతో లింక్ చేయడం… యూఐడీఏఐ రెండో ప్రతిపాదన. చనిపోయినవారి ఆధార్ నంబర్లను ఉపయోగించి ఇతరులు ప్రయోజనాలు పొందుతున్నట్టు యూఐడీఏఐ గుర్తించింది. కొవిడ్ కారణంగా చనిపోయినవారి ఆధార్ నంబర్లను ఉపయోగించి ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేయ డం పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చనిపోయినవారి ఆధార్ నం బర్లు యాక్టివేషన్‌లోనే ఉండటంతో చాలామందికి పెన్షన్లు ఇంకా అకౌంట్లలో పడుతున్నాయని, ఆ సొమ్మును ఇతరులు వాడుకుంటున్నారని సంబంధిత వర్గాలు అం చనా వేస్తున్నాయి. దీన్ని నివారించడానికి క్షేత్రస్థాయిలో నమోదుచేసే మరణాల వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానిస్తారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సంభవించే మరణాలనూ ఆధార్‌తో లింక్ చేస్తారు. మరణించినవారి ఆధార్ ను డీయాక్టివేట్ చేసి, పథకాలు దుర్వినియోగం కాకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ రెండు ప్రతిపాదనల పైలట్ ప్రాజెక్టులు త్వరలోనే ఆరంభం కానున్నాయి.
ఎలాంటి ఐడీ ప్రూఫ్‌లు లేనివారికి ‘జీరో ఆధార్’ను కేటాయించాలని యూఐడీఏఐ ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం… బర్త్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్, ఇతర ఐడీ కార్డులు ఏవీ లేకపోయినా ఆధార్ ఇస్తారు. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు వారి తరఫున ఎలకా్ట్రనిక్ సంతకం చేయాల్సి ఉంటుంది. అలా సంతకం చేసినవారి సమాచారమూ రికార్డుల్లో నమోదవుతుంది. తద్వారా ఒకరికి మించి ఎక్కువమంది కి సంతకం చేయకుండా నియంత్రిస్తారు. ఇక నాలుగో ప్రతిపాదన ప్రకారం.. ఆఽ దార్‌ను డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు తదితర ఐడీ ప్రూఫ్‌లతో క్రాస్ చెక్ చేస్తారు. దీనికోసం డిజిలాకర్ నుంచి ఆయా ప్రూఫ్‌ల వివరాలను సేకరిస్తారు. ఆ ధార్ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ ప్రతిపాదనల ఉద్దేశమని ఓ అధికారి తెలిపారు.
Also Read:Agneepath Scheme: ‘అగ్నిపథ్’పై మిశ్రమ స్పందన.. తప్పుపడుతున్న రక్షణరంగ నిపుణులు