Big Shock To CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ రాజుకుంటోంది. ఉద్యోగులు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. ఫలితంగా సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాత్రం వారి డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల్లో అసహనం పెరిగిపోతోంది. కొద్ది రోజులుగా పీఆర్సీ ప్రకటనతో చెలరేగిన అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్కో ఉద్యోగ సంఘాలు తమ మద్దతు ప్రకటిస్తూ సమ్మె చేయాలని భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది.

పీఆర్సీ ప్రకటన తరువాత ప్రభుత్వం జారీచేసిన జీవోలతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగలేదు. ఆ జీవోల రద్దుతోనే తాము చర్చలకు వస్తామని చెబుతుండటంతో వివాదం సద్దుమణగడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సయోధ్య కుదరడం లేదు. ఆర్టీసీ, వైద్య ఉద్యోగులు సైతం సమ్మెలోకి వెళతామని నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు ఇరకాటంలో పడుతోంది.

Also Read: AP Employees Strike: ఉద్యోగుల సమ్మె: ప్రభుత్వానికి చెలగాటం.. ఉద్యోగులకు ప్రాణసంకటం
ఒక్కో ఉద్యోగ సంఘం సమ్మెకు మద్దతు పలకడంతో ప్రభుత్వంలో అంతర్మథనం మొదలైంది. సమ్మె ప్రభావం నుంచి గట్టెక్కాలని భావిస్తున్నా ఉద్యోగ సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో జీతాల చెల్లింపుపై పీటముడి నెలకొంది. ఫిబ్రవరిలో వేతనాలు వస్తాయో లేదో అనే సందేహంలో ఉద్యోగులు పడిపోయారు. ఇప్పటికే కరోనా సమయంలో వేతనాలు ఇవ్వక ఇబ్బంది పెట్టిన సర్కారు ఇప్పుడు ఇస్తుందో లేదో అని సంశయాలు వస్తున్నాయి.

అన్ని ఉద్యోగ సంఘాలు కూడా సమ్మె బాటలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు నోటీసులు కూడా ఇస్తున్నాయి. దీంతో సర్కారుకు తలనొప్పిగా తయారయింది. మరోవైపు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జగన్ సూచిస్తుండటంలో సమస్య కొలిక్కి రావడం లేదు. దీంతో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న వాటిపై సర్కారు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చూస్తోంది.
Also Read: AP Employees: ఏపీ ఉద్యోగులకు జీతాల తిప్పలు? .. ఈనెల వేతనాలు అందుతాయా?
[…] […]
[…] […]