https://oktelugu.com/

Twitter CEO Parag Agarwal: ట్విట్టర్ సీఈవో పరాగ్ పరిస్థితేంటి? ఎలన్ మస్క్ తొలగిస్తాడా? ఏం జరుగనుంది?

Twitter CEO Parag Agarwal: ట్విటర్ సంస్థ ఎలాన్ మస్క్ సొంతం అయింది. ఈ మేరకు ఆయన కొనుగోలు చేయడంతో ఇప్పుడు కొత్తగా అధినేత అవతారమెత్తారు. ఇన్నాళ్లు సభ్యుడిగా ఉన్న మస్క్ ట్విటర్ కొనుగోలుతో వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. 44 బిలియన్ డాలర్లు చెల్లించి కంపెనీని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మస్క్ చేతిలోనే పాలన పగ్గాలు ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ కొనుగోలుతో ట్విటర్ షేర్ హోల్డర్ల పంట పండినట్లే. ఇబ్బడిముబ్బడిగా షేర్ల ధరలు పెరగడం విశేషం. […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2022 3:33 pm
    Follow us on

    Twitter CEO Parag Agarwal: ట్విటర్ సంస్థ ఎలాన్ మస్క్ సొంతం అయింది. ఈ మేరకు ఆయన కొనుగోలు చేయడంతో ఇప్పుడు కొత్తగా అధినేత అవతారమెత్తారు. ఇన్నాళ్లు సభ్యుడిగా ఉన్న మస్క్ ట్విటర్ కొనుగోలుతో వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. 44 బిలియన్ డాలర్లు చెల్లించి కంపెనీని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మస్క్ చేతిలోనే పాలన పగ్గాలు ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ కొనుగోలుతో ట్విటర్ షేర్ హోల్డర్ల పంట పండినట్లే. ఇబ్బడిముబ్బడిగా షేర్ల ధరలు పెరగడం విశేషం.

    Twitter CEO Parag Agarwal

    Twitter CEO Parag Agarwal

    కార్పొరేట్ దిగ్గజంగా ట్విటర్ ఎదగడంతో షేర్ల ధరలు పెరుగుతున్నాయి. ఒక్కో షేర్ ధర 77 డాలర్ల మేర పెరగడంతో సంస్థ మనుగడ ఎక్కడికో వెళ్లనుందని సభ్యులు పేర్కొంటున్నారు. ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది ఉండటంతో సంస్థ కోసం సమీక్షలు చేస్తున్నారు. కంపెనీని ఎలా అభివృద్ధి చేయాలని డైరెక్టర్లతో మస్క్ భేటీ అవుతున్నారు. ఈ మేరకు వారికి సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఇక ట్విటర్ మనుగడ ఎక్కడికో వెళ్లనుందని తెలుస్తోంది.

    Also Read: AP Govt Schools: ‘భరత్ అనే నేను’.. మహేష్ లా.. సీఎం జగన్ సాధించాడు..

    ప్రస్తుతం ట్విటర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, భారతీయుడైన పరాగ్ అగ్రవాల్ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆయనను తొలగిస్తే పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి. అందుకే ట్విటర్ యాజమాన్యం ఆయనను తొలగించేందుకు ప్రయత్నిస్తుందా? లేక కొనసాగింపుకే ప్రాధాన్యం ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. అయితే దీనిపై కొత్త పాలకవర్గం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

    Twitter CEO Parag Agarwal

    Twitter CEO Parag Agarwal

    ట్విటర్ సీఈవో వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 12 నెలల్లో అత్యున్నత పదవి నుంచి తొలగించాల్సి వస్తే యాజమాన్యం దాదాపు 42 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అంతటి సాహసం చయకపోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో కొత్త యాజమాన్యం ఆలోచన ఎలా ఉంటుందో అనే దానిపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

    Also Read:High Temperatures: 122 ఏళ్లలో ఎన్నడు చూడని వేడి.. ఎండలతో జాగ్రత్త సుమా?

    Tags