
Minister Talasani- CM KCR: ప్రధాని నరేంద్ర మోదీ దేవుడి లాంటి వ్యక్తి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ సంబోధిస్తుంటారు. స్వామిభక్తి కోసమే, మోదీపై ఉన్న నమ్మకమో కానీ పార్టీ నేతగా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. కానీ దీనిని బీఆర్‌ఎస్ నేతలు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అయితే తాను నిర్వహించే ప్రతీ మీటింగ్‌లో ఈ విషయాన్ని లేవనెత్తుతూ మోదీ ఎవడికి దేవుడు అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ ప్రధానిని దైవంగా భావించినందుకే ఇన్ని విమర్శలు చేస్తున్న కేటీఆర్.. మరి తెలంగాణ మంత్రి తలసాని సీనన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకంగా కొమురవెల్లి మల్లన్నతో పోల్చాడు. గతంలో మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా సీఎం కేసీఆర్‌ను కొమురెల్లి మల్లన్న అని ప్రకటించారు. దీంతో ఆయనకు మంత్రిపదవి దక్కింది. తాజాగా మంత్రి పదవిలో ఉన్న తలసాని కూడా కేసీఆర్‌ను యాదవుల ఆరాధ్య దైవం కొమురెల్లి మల్లన్నతో పోల్చడం వివాదాస్పదమవుతోంది.
Also Read: Modi – BJP : నరేంద్రమోదీ వన్స్‌మోర్.. మరోసారి బీజేపీకే అధికారం!
కొడుకు కోసమేనా.. తలసానీ..
యాదవుల ఆరాధ్య దైవం మల్లన్న. మంత్రి తలసాని కూడా యాదవుడే. అయినా తమ దేవునికంటే కేసీఆర్ ఎక్కువ అన్నట్లు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రి పదవిలో ఉన్న తలసాని ఇలాంటి వ్యాఖ్యల వెనుక రాజకీయం కోణం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తలసాని తన కొడుకుకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇప్పించి పోటీ చేయించాడు. కానీ కిషన్‌రెడ్డి చేతిలో తనసాని కొడుకు ఓడిపోయాడు. దీంతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలో తలసాని తన కొడుకును ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. దీంతో కేసీఆర్‌ను సడెన్‌గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్న చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలోనే తలసాని తన కొడుకుకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. దేడుడితో కేసీఆర్‌ను పోల్చడంపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మల్లన్న మహిమగల దేవుడని, సీఎం కేసీఆర్‌ను దేవునితో పోల్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ ప్రధాని మోదీని దేవుడు అన్నందుకే విమర్శలు చేస్తున్న కేటీఆర్, తలసాని చేసిన వ్యాఖ్యలపైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.
Also Read:Adani Group Shares: హిండెన్ బర్గ్ ఎంత ముంచినా.. మళ్లీ పుంజుకున్న అదానీ షేర్లు!