Ts High Court: తెలంగాణ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఓ బాలిక విషయంలో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కేసు వివరాలు పరిశీలిస్తే బంజారాహిల్స్ కు చెందిన ఓ బాలిక(15) అవాంఛిత గర్భం దాల్చింది. దీంతో ఆమె గర్భ విచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఓకే చెప్పింది. బాలిక విషయంలో కోర్టు తీర్పుపై అందరు హర్షం వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని బాలికను శారీరకంగా లోబరుచుకుని లైంగిక వాంఛలు తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. వయసు రీత్యా ఆరోగ్య కారణాల చేత గర్భవిచ్చిత్తికి అవకాశం కల్పించాలని కోర్టును అభ్యర్థించడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.

బాలిక ఎనిమిదో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. ఖమ్మం జిల్లాకు చెందిన వారి సమీప బంధువు వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి బాలిక ఇంట్లోనే మకాం వేశాడు. తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికను లోబరుచుకుని ఆమెకు గర్భం వచ్చేలా చేశాడు. దీంతో అవాంఛిత గర్భంతో బాలిక గర్భవిచ్చిత్తికి అవకాశం ఇవ్వాలని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులను కోరగా చట్టపరంగా చిక్కులొస్తాయని వారు నిరాకరించారు. దీంతో బాలిక హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్పందించి గర్భవిచ్చిత్తి చేయాలని సూచించింది.
Also Read: AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం
ఈ మేరకు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక ఇష్టపడి సంభోగంలో పాల్గొన్నా అది అత్యాచారం పరిధిలోకే వస్తుందని చెప్పింది. బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతున్న క్రమంలో గర్భాన్ని తొలగించుకునేందుకు అన్ని దారులు చూపించింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి బాలికకు న్యాయం చేయాలని సూచించింది. దీంతో 20 వారాల గర్బాన్ని తొలగించేందుకు వైద్యులు ముందుకొచ్చారు.

అయితే సమీప బంధువుగా ఇంట్లోకి వచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎవరిని నమ్మడానికి వీలు లేదు. బంధువునంటూ వచ్చి బాలికపై లైంగిక దాడి చేసి ఆమె గర్భానికి కారణమైన నిందితుడి(26)పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది.
Also Read: Sri Lanka Financial Crisis 2022: శ్రీలంకలో తీవ్ర సంక్షోభానికి కారణాలేంటి?