BJP vs TRS: తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికే సిద్ధమైంది. ధాన్యం కొనుగోలును రాజకీయం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సంస్థల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని భావిస్తోంది. దీనికి గాను తేదీలు కూడా ఖరారు చేసింది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వ్యూహం రచిస్తోంది. నేటి నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనికి గాను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పంజాబ్ రాష్ర్టం మాదిరి తెలంగాణ ధాన్యం కూడా మొత్తం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేయడానికి ముందుకొచ్చింది. అసెంబ్లీ తీర్మానాలకు విలువ లేని సమయంలో పంచాయతీల తీర్మానాలకు అర్తం ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు చేసిన తీర్మానాలను కొరియర్, స్పీడ్ పోస్టు ద్వారా ప్రధాని కార్యాలయానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంచుకున్న వ్యూహంలో భాగంగానే తీర్మానాలు చేయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: Amit shah vs Prashant Kishor: అమిత్ షా, పీకే వ్యూహాలకు గుజరాత్ వేదిక కానుందా?
పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు పంపిన తీర్మానాలను కేంద్రం పట్టించుకుంటుందా? ఇదేదో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తూ టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంగానే తెలుస్తోంది. దీంతో కేంద్రానికి వచ్చిన నష్టమేమీ లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా దాని పన్నాగాలు పని చేయవని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు అందరు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని కేసీఆర్ చీప్ పాలిట్రిక్స్ కు తెరలేపుతున్నారనే వాదనలు వస్తున్నాయి. ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు గమనిస్తున్నారనేది తెలిసిందే. ఇందులో భాగంగా తీర్మానాలు చేస్తూ ఏదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడానికి ప్రాదాన్యం ఇస్తున్నట్లు సమాచారం. తీర్మానాల విషయంలో కాంగ్రెస్ కూడా స్పందించడం లేదు. దీంతో కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతుందా అనే అనుమానాలే అందరిలో వస్తున్నాయి. ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పోకుండా హుందాగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Also Read: CM Kcr- Prashant Kishor: వాళ్లను వద్దంటున్న పీకే.. కేసీఆర్ కు రిపోర్ట్.. ప్రక్షాళన తప్పదా..?