Petrol Diesel Price Increase: అంతా భయపడుతున్నట్టే మళ్లీ పెట్రో మోత మోగుతోంది. మొన్నటి వరకు తటస్థంగా ఉన్న చమురు ధరలు ఒక్కసారిగా ధరల పిడుగును వేస్తున్నాయి. గత ఐదు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ మీద రూ.3.10 పెరిగింది. ఇటు తెలంగాణలోనూ ధరలు విపరీతంగా పెరుగతున్నాయి. ఇంకా కూడా పెరుగుతాయంట.
ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ మీద రూ.89 పైసలు పెరగ్గా, డీజిల్ మీద రూ.86 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ రేటు రూ.110.91 ఉండగా.. డీజిల్ ధర రూ.98.34కి చేరింది. అటు ఏపీలో ఈ ధరలు చూసుకుంటే.. విశాఖపట్టణలో పెట్రోల్ లీటర్ కు రూ.110.68 ఉండగా.. డీజిల్ మాత్రం రూ.97.69గా నమోదైంది. అటు ఢిల్లీల ఈ రేట్లు చూసుకుంటే.. లీటర్ పెట్రోల్ ధర రూ.98.61గా ఉంది. అదే ముంబైలో రూ.113.35గా ఉండగా.. కోల్‌కతాలో రూ.108.01గా ఉంది.
Also Read: BJP vs TRS: కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ‘తీర్మానాల’ పోరు.. ఫలిస్తుందా?
ఇటు చెన్నైలో రూ.104.43గా ఉండగా.. బెంగళూరులో రూ.103.93గా ఉంది. జైపూర్‌లో రూ.110.56గా ఉంది. ఇక లక్నోలో రూ.98.34గా ఉంది. మార్చి 22 నుంచి ఈ ధరలు పెరగడం మొదలయింది. ఈ ఐదు రోజుల్లో పెట్రోల్ మీద రూ.3.10 పెరగ్గా.. చాలా చోట్ల ఇంకా ఎక్కువగానే పెరిగినట్టు తెలుస్తోంది. రోజుకు లీటర్ పెట్రోల్ మీద రూ.80 పైసల వరకు పెరుగుతూన ఉంది.
అయితే ఈ ధరల పెంపు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా, యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో… అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 118గా ఉంది. రష్యా నుంచి పెట్రోల్ దిగుమతులు తగ్గిపోవడంతో.. ఈ రేట్లు పెరిగినట్టు చెబుతున్నారు. ఇలా కొనసాగితే రూ.20 వరకు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒక ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇతర దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేసినా.. భారత్ మాత్రం తక్కువ ధరకే పెట్రోల్‌ను కొంటోంది. కానీ ఈ ధరల మోత మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.
Also Read: Amit shah vs Prashant Kishor: అమిత్ షా, పీకే వ్యూహాలకు గుజరాత్ వేదిక కానుందా?