CM Kcr- Prashant Kishor: మరోసారి అధికారాన్ని దక్కించుకుని తన చరిష్మాను తెలంగాణ చరిత్రలో లిఖించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే గత రెండు సార్లు వర్కౌట్ అయిన సంక్షేమ పథకాలు, తెలంగాణ సెంటిమెంట్ మరోసారి గట్టెక్కిస్తాయనే నమ్మకం కేసీఆర్‌లో పోయింది. అందుకే మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం కష్టమని.. ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారు.
మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలా ఉంటాయో మనందరికీ గతంలో తెలిసిందే. ఆయన సర్వేల ఆధారంగా వ్యతిరేకత ఉన్న వారిపై వేటు వేయిస్తారు. ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తోంది. ఎమ్మెల్యేల మార్పుతో పాటు పార్టీ క్షేత్ర స్థాయిలో ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై పీకే ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు రిపోర్టులు పంపిస్తూనే ఉన్నారంట.
Also Read: Amit shah vs Prashant Kishor: అమిత్ షా, పీకే వ్యూహాలకు గుజరాత్ వేదిక కానుందా?
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి కాకుండా.. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఉందనే అసంతృప్తి పార్టీలో ఎక్కువగా ఉందని పీకే చెప్పారంట. దాంతో పాటు కొత్త, పాత వారి మధ్య సమన్వయం కూడా లేదని వివరించారు. ఇందులో ముఖ్యంగా.. కొందరు స్థానిక ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని సర్వే రూపంలో పీకే గుర్తించారంట. ఈ ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ కోసం పనిచేసే వారిని పట్టించుకోవట్లేదని, కాబట్టి వారిపై వేటు వేస్తారనే గుసగుసలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు కింది స్థాయి కేడర్‌ను పట్టించుకోకుండా.. ప్రజలకు కూడా అందుబాటులో ఉండట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా ఇవన్నీ కూడా ఆ ఎమ్మెల్యేలపై వేటు పడేలాగే కనిపిస్తున్నాయి. ఇలా సమర్థవంతంగా పనిచేయని ఎమ్మెల్యేల లిస్టును కేసీఆర్‌కే పీకే అందించారని సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కొంత టెన్షన్ మొదలైందట. దీంతో వారందరూ తమ సీటును కాపాడకునే ప్రయత్నాల్లో భాగంగా.. అధినాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరెవరు తమ సీటును కాపాడుకుంటారో వేచి చూడాలి.
Also Read: TS Tet Notification 2022: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో కీలక మార్పులు.. నిబంధనలివీ