TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నియోజకవర్గంగా కామారెడ్డి మారింది. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ సీనియర్‌నేత నారాయణరెడ్డి బరిలో ఉన్నారు. సీఎం, పీసీసీ చీఫ్ పోటీ చేస్తుండడంతో రాష్ట్రంలో అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. ఇక గజ్వేల్ కూడా ఇలాగే ఉంది. ఇక్కడి నుంచి కేసీఆర్‌తోపాటు బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపుపై తెలంగాణ ఉత్కంఠగా చూస్తోంది.
కామారెడ్డిలో కాంగ్రెస్‌కు ఆధిక్యం..
కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పోస్టర్ బ్యాలెట్‌లో కూడా రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో కూడా కాంగ్రెస్‌కే ఆధిక్యం దక్కింది. దీంతో ఫలితం ఆసక్తిరేపుతోంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ బీజేపీ గెలుస్తుందని తేలింది. కానీ కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. సీఎం కే సీఆర్ వెనుకబడ్డారు.
గజ్వేల్‌లో..
ఇక గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక్కడ ఆయనపై ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌తో ఈటల కేసీఆర్‌కు చెక్ పెడతారని భావించారు. కానీ సర్వేలు మాత్రం కేసీఆరే గెలుస్తారని తెలిపాయి. అంచనాలకు తగినట్లుగానే ఓట్లు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ ఫలితాల తర్వాత కేసీఆర్ కేవలం 510 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.