US France trade tensions: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో విర్రవీగుతున్నాడు. వెనుజువెలా అధ్యక్షుడిని సైలెంట్ ఆపరేషన్‌తో అదుపులోకి తీసుకున్న తర్వాత ట్రంప్ అహంకారం తలకెక్కింది. ఈ క్రమంలో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని విర్రవీగుతున్నాడు. ఫ్రాన్స్ నేత ఇమాన్యుయల్ మాక్రో గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణను విభేదించారు. ఇద్దరూ లేఖల ద్వారా గొడవ పడుతున్నారు, వైట్ హౌస్ వాటిని బహిర్గతం చేస్తోంది. దీని ఫలితంగా ట్రంప్ ఫ్రెంచ్ షాంపేన్, వైన్ దిగుమతులపై 200% సుంకాలు ప్రకటించారు, ఇది ద్వైపాక్షిక ఒత్తిడిని పెంచింది.
గ్లోబల్ పీస్ కమిటీ..
ఇక ట్రంప్ నేతృత్వంలో ’గ్లోబల్ పీస్ కమిటీ’ ఏర్పాటవుతోంది. చేరాలంటే ప్రతీ దేశం 10 కోట్ల డాలర్లు చెల్లించాలి. చిన్న దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్, పాకిస్తాన్‌తో పాటు అనేక దేశాలకు ఆహ్వానాలు పంపారు. ఉగ్రవాద సమస్యలతో పోరాడే పాకిస్తాన్‌ను చేర్చడం అంతర్జాతీయంగా చర్చనీయం. మాక్రో దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ లక్ష్యంగా మారారు. ఇక వరల్డ్ పీస్ బోర్డుతో గాజాను పునర్నిర్మించాలని ట్రంప్ భావిస్తున్నారు.
భారత్–యూఏఈ బంధం బలోపేతం..
యూఏఈ అధినేత షేక్ మహ్మద్ బిన్ సయ్యద్ భారత్‌కు రెండు గంటల సందర్శన చేశారు. ప్రధాని మోదీ విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికి, ఒకే వాహనంలో ప్రయాణించారు. రక్షణ ఒప్పందాలు, 0.5 బిలియన్ టన్నుల ఎల్పీజీ సరఫరా, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఏఐ సమ్మిట్‌లో సహకారం చర్చనీయాంశాలు. భారత ఆయుధాలను కలిసి విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. యూఏఈ ఆఖఐఇ లో చేరి, పాకిస్తాన్ వీసాలపై ఆంక్షలు విధించడంతో భారత విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది.
భారత్ పోలెండ్ మధ్య వివాదం..
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పోలెండ్ డెప్యూటీ ప్రధానితో ఉక్రెయిన్ విధానం, రష్యన్ ఇంధనాలపై తీవ్రంగా వాదించారు. వెమా ట్రయాంగిల్ (ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్) సందర్భంగా భారత్‌పై ఆరోపణలు చేశారు. పోలెండ్–పాకిస్తాన్ సంబంధాలు, ఉక్రెయిన్ సరిహద్దు ఒత్తిడి మధ్య భారత్ స్వార్థాలను కాపాడుకోవాలి. ఉ్ఖతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం రానుంది, పోలెండ్‌కు భారత అవసరం ఎక్కువ. ట్రంప్ గాజా పునర్నిర్మాణానికి ప్రపంచ శాంతి బోర్డ్‌ను ప్రతిపాదిస్తున్నారు.
అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలకు భారత్ దృఢంగా స్పందిస్తోంది. యూఏఈతో పరస్పర అవసరాలు, పోలెండ్‌తో వాణిజ్య అవకాశాలు లెక్కించి ముందుకు సాగుతోంది. ట్రంప్ పీస్ కమిటీలో భారత పాత్ర కీలకం కావచ్చు. జాతీయ లాభాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ వ్యూహం ప్రపంచ రంగంలో భారత్ బలాన్ని పెంచుతోంది.