ఆఖరి రోజుల్లోనూ ట్రంప్‌ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని వీడబోతున్నారు. ఇప్పటికే కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ నియామకం కావడంతో ఆయన కొత్త అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే.. ట్రంప్‌ ఈ చివరి రోజుల్లోనూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన మరిన్ని యాప్‌లపై నిషేధం విధించారు. Also Read: కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ఇండియన్స్‌ బిలియనీర్‌‌ జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూపు ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్‌ గ్రూపునకు చెందిన వీచాట్‌పే లావాదేవీ […]

Written By: Srinivas, Updated On : January 6, 2021 3:34 pm
Follow us on


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని వీడబోతున్నారు. ఇప్పటికే కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ నియామకం కావడంతో ఆయన కొత్త అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే.. ట్రంప్‌ ఈ చివరి రోజుల్లోనూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన మరిన్ని యాప్‌లపై నిషేధం విధించారు.

Also Read: కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ఇండియన్స్‌

బిలియనీర్‌‌ జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూపు ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్‌ గ్రూపునకు చెందిన వీచాట్‌పే లావాదేవీ యాప్‌లు సహా మొత్తం ఎనిమిదింటిని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు.ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రానుంది.

అయితే.. అప్పటికి బైడెన్‌ అధ్యక్ష పదవిని అలంకరించనున్నారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌లు చైనాకు చేరవేస్తున్నాయని ట్రంప్‌ ప్రధాన ఆరోపణ. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల సమాచారాన్ని సేకరించి చైనా ప్రభుత్వం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. ట్రంప్‌ నిర్ణయంపై ఇటు కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ బృందం గానీ, అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం గానీ స్పందించలేదు.

Also Read: ఆ నూనెలకు గంగూలీ గుండెపోటు సెగ

గతంలోనూ వీచాట్‌ పేను ట్రంప్‌ నిషేధించారు. అప్పట్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు యాపిల్‌, ఫోర్డ్‌ మోటార్‌‌, వాల్‌మార్ట్‌, వాల్ట్‌ డిస్నీ ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. చైనాలో వ్యాపార నిర్వహణకు ఈ యాప్‌లు ఎంతో కీలకమని చెప్పాయి. దీన్ని కోర్టులో సవాల్‌ చేయగా.. ట్రంప్‌ నిర్ణయాన్ని ధర్మాసనం కొట్టేసింది. తాజా నిషేధాన్ని కూడా అమెరికా వ్యాపార సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు