మామూలుగా ఏదైనా ప్రోగ్రాం హిట్ కావాలంటే ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ చానెల్స్ లోనే చేయాలి.. తెలుగు నాట మాటీవీలో బిగ్ బాస్, ఈటీవీలో ఢీ, జబర్ధస్త్ లాంటివి ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వాటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. వాటికి కోట్లలోనే యాడ్స్ రూపంలో రాబడి వస్తుంటుంది.
Also Read: చిత్ర పరిశ్రమకి గత వైభోగం రానున్నదా ?
అయితే తొలిసారి ‘ఆహా’ ఓటీటీ ఇలాంటి ప్రయత్నమే చేసింది. కానీ టీవీ అంటే అందరి ఇంటింటికి ఉంటుంది. ఈ ఆన్ లైన్ ఓటీటీలు ఎవరికుంటాయి. అందుకే హీరోయిన్ సమంత ఎంట కష్టపడి ‘సామ్ జామ్’తో షోను రక్తకట్టిస్తున్నా కూడా దాన్ని చూసే జనాలు చాలా తక్కువ కావడంతో గిట్టుబాటు కావడం లేదన్న చర్చ సాగుతోంది. సమంతా హోస్ట్ గా చేస్తున్న తొలి టాక్ షో ‘సామ్ జామ్’ షెడ్యూల్ సమయానికి ముందే ముగిసింది. దీనికి వచ్చిన బజ్ ను ఇప్పుడు పరిశీలిస్తున్నారట.. ఈ టాక్ షోను బహుళ సీజన్లలో ప్లాన్ చేశారు, మొదటి సీజన్లో పది మంది ప్రముఖుల ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలకు మోస్తరు స్పందనే వస్తోందట.. టాక్ షోకు తగినంత ప్రేక్షకాదరణ లేదు. ఎందుకంటే ఓటీటీలు చూసే జనాభా.. జనాలు చాలా తక్కువ. స్మార్ట్ టీవీ ఉండే వారు.. పైగా అందులో ‘ఆహా’ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికే సమంత షోను చూడగలరు. దీంతో చాలా మంది సాధారణ ప్రజలకు ఈ షో చేరువ కాలేకపోయింది. ఈక్రమంలోనే స్పందన తక్కువగా ఉండడంతో ఆహా ఒటిటి కేవలం ఎనిమిది ఎపిసోడ్‌లతో సీజన్‌ను ముగించడానికి ప్లాన్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నారు. ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ ను ఇటీవలే ఆమె భర్త నాగ చైతన్యతో చిత్రీకరించారని టాలీవుడ్ టాక్..
Also Read: దేవత పాత్రలో దెయ్యం.. ఫుల్ ఎక్స్ పోజింగ్ !
సామ్ జామ్ లోని ప్రముఖుల ఆసక్తికర ముచ్చట్లు.. యూట్యూబ్ ఛానెల్‌లు మరియు వెబ్‌సైట్‌లకు వార్తలను రాయడానికి.. సంచలనాలతో వండడానికి మాత్రమే ఉపయోగపడిందట.. ఈ కార్యక్రమం ఆహా ఓటీటీకి ఎక్కువ విలువను తీసుకురాలేదని ప్రచారం సాగుతోంది.
సమంతకు మాత్రం గిట్టుబాటు అయ్యిందట.. ఆమెకు భారీగా పారితోషికం లభించడంతో ఈ షో నుండి లబ్ధి పొందారు. టాక్ షో హోస్ట్‌గా కూడా ఆమె తన ప్రతిభను ప్రదర్శించింది. ప్రశ్నలు మరియు ఫార్మాట్ తో అందరినీ ఆకట్టుకొని అవకాశాలు అందిపుచ్చుకునేలా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్