https://oktelugu.com/

డూప్ భార్యతో ట్రంప్ ప్రచారం.. దుమారం

భార్య లేకపోతే ఎవరైనా ఒంటరిగా వెళతారు. కానీ మన తిక్క ట్రంప్ మాత్రం డూప్ భార్యతో వెళుతున్నాడు. భార్యలాగానే ఆమెను వెంటపెట్టుకొని చట్టాపట్టాలేసుకొని అమెరికా ఎన్నికల ప్రచారంలో తెగ తిరిగేస్తున్నాడట.. అయితే దగ్గరగా గమనించిన వారికి షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కనే కొద్దిరోజులుగా ఉంటూ తిరుగుతున్న ఆమె అసలు ఆయన భార్య మెలానియా కాదు.. అచ్చం ఆమెలాగానే ఉన్న డూప్. Also Read: ప్రజలకు అధికారం దిశగా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వ చర్యలు ఈ వ్యవహారం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2020 / 12:04 PM IST
    Follow us on

    భార్య లేకపోతే ఎవరైనా ఒంటరిగా వెళతారు. కానీ మన తిక్క ట్రంప్ మాత్రం డూప్ భార్యతో వెళుతున్నాడు. భార్యలాగానే ఆమెను వెంటపెట్టుకొని చట్టాపట్టాలేసుకొని అమెరికా ఎన్నికల ప్రచారంలో తెగ తిరిగేస్తున్నాడట.. అయితే దగ్గరగా గమనించిన వారికి షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కనే కొద్దిరోజులుగా ఉంటూ తిరుగుతున్న ఆమె అసలు ఆయన భార్య మెలానియా కాదు.. అచ్చం ఆమెలాగానే ఉన్న డూప్.

    Also Read: ప్రజలకు అధికారం దిశగా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వ చర్యలు

    ఈ వ్యవహారం ట్రంప్ వ్యక్తిగతం అయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు ప్రచార అస్త్రమైంది. బాడీ డబుల్, కాన్ స్పిరసీ థియరీకి ట్రంప్ పాల్పడుతున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. భార్య మెలానియాకు, ట్రంప్ విభేదాలు ఉన్నాయని.. అందుకే ఈ ఫేక్ లేడీని తీసుకొచ్చాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    గుర్తు తెలియని మహిళను తన భార్యగా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 22న నాష్ విల్లే డిబేట్ కు వైట్ హౌస్ నుంచి మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రంప్ తోపాటు ఆ మహిళ పక్కనే నిల్చుని కనిపించిన ఫొటో వైరల్ గా మారింది. చూస్తే అచ్చం మెలానియాగానే ఉన్నా.. దగ్గరగా పరిశీలిస్తే ట్రంప్ భార్య కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మెలానియా అంత ఎత్తు లేకపోవడాన్ని నెటిజన్లు గుర్తించారు. దీంతో ‘ఫేక్ మెలానియా’ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు.

    Also Read: చరిత్ర మరిచిన జమ్మూ-కాశ్మీర్ చీకటి రోజు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తేది దగ్గరపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ప్రత్యర్థి జోబైడెన్ అన్ని ర్యాలీలు, ప్రచారాలు, డిబేట్లలో ఆధిపత్యం చెలాయిస్తున్న వేళ ట్రంప్ కు మరో వివాదం చుట్టుముట్టింది.

    కొద్దిరోజులుగా డొనాల్డ్ ట్రంప్ తన వెంట ఓ అజ్ఞాత మహిళను తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, సెమినార్లు, డిబేట్లలో ఆమె డొనాల్డ్ ట్రంప్ పక్కనే ఉంటున్నారు. మొదట ఈమెను డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాగా భావించారు. తీరా ఫొటోలను క్లోజప్ లో పరిశీలించగా.. ఆమె మెలానియా కాదని.. తన భార్యలాగానే ఉన్న ఒక ఆమెను ట్రంప్ వెంటపెట్టుకొని తిరుగుతున్నాడని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు.