Fundraising: అధికారంలో ఉన్న పార్టీలకు విరాళిస్తారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు పార్టీలు సేకరించుకుంటున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన పార్టీలకు ఇలా బాండ్ల రూపంలో రూ. కోట్లు వస్తున్నాయి. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీలకు విరాళాల రూపంలో రూ. కోట్లు చేరుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ పార్టీకే అత్యధికంగా వస్తున్నట్లు తెలుస్తోంది. 2019-20 సంవత్సరానికి రూ. 130 కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో సాధించింది. దీంతో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు సేకరించిన పార్టీగా నిలిచింది.

శివసేన పార్టీ రెండో స్థానంలో వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి. శివసేనకు రూ. 111 కోట్లు, వైసీపీకి రూ. 92 కోట్లు విరాళాలు సమకూరాయి. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ మొదటిస్థానంలో ఉంది. దీంతో పార్టీల మనుగడ వాటితోనే సాధ్యమవుతుంది. ప్రాంతీయ పార్టీలన్నింటికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447 కోట్లు వచ్చాయి. కానీ 42 పార్టీల్లో 14 పార్టీలు మాత్రమే విరాళాల వివరాలు వెల్లడించాయి. మిగతా పార్టీలు తమ గుట్టు బయట పెట్టడం లేదు.
టీఆర్ఎస్ పార్టీకి ఇంత భారీ స్తాయిలో ఆదాయం వస్తున్నా దాన్ని మాత్రం ఖర్చు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలకు వాడాల్సి ఉన్నా అధికార పార్టీ మాత్రం ఆ నిధులు మాత్రం ముట్టడం లేదు. దీంతో ఎన్ని వచ్చినా అందులో మూలుగుతున్నాయే కానీ వాటి వినియోగం జరగడం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం మింగుడుపడటం లేదు. ఇందులో టీడీపీ కూడా ఉంది. లోటు బడ్జెట్ తో నష్టాల్లో కొనసాగుతోంది. డీఎంకే పరిస్థితి కూడా అంతే. ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలకు కష్టాలే మిగులుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. విరాళాలు వస్తేనే పార్టీకి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఏర్పడతాయి. కానీ కొద్ది రోజులుగా పార్టీలకు బాండ్ల రూపంలో ఎలాంటి ఆదాయం రాకపోవడంతో వాటి నిర్వహణపై ప్రభావం కనపిస్తోంది. ఇలాగైతే పార్టీలు భవిష్యత్ లో కార్యక్రమాలు చేపట్టే విధంగా ముందకు సాగేలా కనిపించడం లేదు.