Srikanth: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాక హీరో శ్రీకాంత్ మంచు విష్ణుతో పూర్తిగా కలిసిపోయాడు. తమ్ముడు అంటూ విష్ణు భుజం పై చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. విష్ణు కూడా శ్రీకాంత్ తనతోనే ఉంటాడు అని భరోసాగా మాట్లాడాడు. కానీ, ఈ సాయంత్రం ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన11 మంది రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ఫ్యానెల్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బలమైన ఎమోషనల్ స్పీచ్ లు ఇచ్చారు.

ఈ సందర్భంగా మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ పై విజయం సాధించిన శ్రీకాంత్ కూడా ఎన్నికల జరిగిన విధానం పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అందరం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. తను నాకు తమ్ముడు లాంటి వాడు.
కానీ, రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు ఉన్నప్పుడు.. ‘మా’ అభివృద్దికి అది ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. మా ప్యానెల్ లోని సభ్యులు అందరికీ సమస్యలు ఎత్తి చూపే అలవాటు ఉంది. అలాగే చూపితే గొడవలు జరగొచ్చు. దాంతో అభివృద్ధి మా వల్లే జరగలేదని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. అందుకే మా ప్యానల్ తరపున గెలిచిన వాళ్ళందరం రాజీనామా చేస్తున్నాం.
ఈ నిర్ణయం వెనుక నరేష్ కూడా ఒక కారణం. గతంలో ‘మా’అధ్యక్షుడిగా పని చేసిన నరేష్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు పనిచేస్తాడేమో అనే అనుమానం మాకు ఉంది. అందుకే, మేము తప్పుకుంటున్నాం. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. ఇక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని విష్ణు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. విష్ణు కచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతున్నాం. ఒకవేళ నెరవేర్చేలేక పోతే కచ్చితంగా ప్రశ్నిస్తాం’ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.