Is BJP Anti Dalit: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో దళితులు

Is BJP Anti Dalit: టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా దళితుల కేంద్రంగా వీరిద్దరి మధ్య ఫైట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో అయితే కౌంటర్లు, రీకౌంటర్లతో హోరెత్తిస్తున్నారు. మధ్యలో దళితుల అంశాన్ని ప్రధానంగా తీసుకొని వీరి రాజకీయం నడుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా రాజ్యాంగాన్ని మార్చాలనడం పెద్ద దుమారం రేపింది. ఈ రాజ్యాంగం వల్లనే దళితులు, బీసీలు, ఇతర వర్గాలకు హక్కులు కల్పించబడ్డాయి. బీజేపీ అయితే ‘భీం దీక్ష’ అంటూ […]

Written By: NARESH, Updated On : February 7, 2022 10:16 pm
Follow us on

Is BJP Anti Dalit: టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా దళితుల కేంద్రంగా వీరిద్దరి మధ్య ఫైట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో అయితే కౌంటర్లు, రీకౌంటర్లతో హోరెత్తిస్తున్నారు. మధ్యలో దళితుల అంశాన్ని ప్రధానంగా తీసుకొని వీరి రాజకీయం నడుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా రాజ్యాంగాన్ని మార్చాలనడం పెద్ద దుమారం రేపింది. ఈ రాజ్యాంగం వల్లనే దళితులు, బీసీలు, ఇతర వర్గాలకు హక్కులు కల్పించబడ్డాయి. బీజేపీ అయితే ‘భీం దీక్ష’ అంటూ కేసీఆర్ ను ఇరుకునపెట్టింది.

దీనికి కౌంటర్ గా కేసీఆర్ తన దళిత మంత్రులు, ఎమ్మెల్యేలతో బీజేపీని తిట్టించింది. బీజేపీ మనువాద పార్టీ.. దళిత వ్యతిరేక పార్టీ అని టీఆర్ఎస్ ఆరోపించింది. మరి వాస్తవం ఏంటంటే? ఒకప్పుడు బీజేపీని బ్రాహ్మణులు, వైశ్యుల పార్టీగా ఉండేది. కానీ ఇవాళ.. బీజేపీ ఆ పరిస్థితి లేదు. మోడీ కేబినెట్ లో 27మంది ఓబీసీలు, దళితులను కలుపుకుంటే 50 మందికి పైగా ఉన్నారు.

బీజేపీలో ఇప్పుడు ఓబీసీలకు పెద్దపీట వేశారు. పార్టీలో ఓబీసీలు, దళితులే ఎక్కువగా ఉన్నారు. బీజేపీని దళిత వ్యతిరేక పార్టీ అని చూపించడానికి లేదు. ఇక కేసీఆర్.. దళిత సీఎం..దళిత బంధు, దళితులకు మూడు ఎకరాల హామీని అమలు చేయలేదని బీజేపీ ఆరోపణ.. ఇది వాస్తవమే.. మరి బీజేపీ దళితులకు ఎందుకు వ్యతిరేకం? కేసీఆర్, టీఆర్ఎస్ వాదన సరైనదా? ఎవరిది తప్పు ? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..