https://oktelugu.com/

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించించిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ అమల్లోకి ఉన్న సమయంలో పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో మాత్రమే నమోదయ్యావి. లాక్డౌన్ కొద్దిరోజులు ఉంటుందని భావించిన కేంద్రానికి వైరస్ షాకిచ్చింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతుండటం, లాక్డౌన్ అమలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతోపాటు కేంద్రానికి ఆదాయం తగ్గిపోతూ వచ్చింది. దీంతో చేసేదీమేక కేంద్రం లాక్డౌన్లో భారీ సడలింపులను ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలు కూడా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల పేరిట […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 27, 2020 12:37 pm
    Follow us on


    దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించించిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ అమల్లోకి ఉన్న సమయంలో పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో మాత్రమే నమోదయ్యావి. లాక్డౌన్ కొద్దిరోజులు ఉంటుందని భావించిన కేంద్రానికి వైరస్ షాకిచ్చింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతుండటం, లాక్డౌన్ అమలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతోపాటు కేంద్రానికి ఆదాయం తగ్గిపోతూ వచ్చింది. దీంతో చేసేదీమేక కేంద్రం లాక్డౌన్లో భారీ సడలింపులను ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలు కూడా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల పేరిట సడలింపులు ఇచ్చాయి.

    సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

    ప్రస్తుతం లాక్డౌన్ 5.0కొనసాగుతోంది. ఈనెల 30వరకు ఇది కొనసాగనుంది. దీనిని కేంద్రం ఆన్ లాక్ 1.0 అంటోంది. ఇటీవల ప్రధాని మోదీ సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇకపై లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. జూన్ 30తర్వాత ఆన్ లాక్ 2.0పైనే దృష్టిసారించినట్లు తెలిపారు. కరోనా ఎంట్రీ సమయంలో ఆదాయం కంటే ప్రజల ప్రాణాలమే ముఖ్యమని చెప్పిన మోడీ ప్రభుత్వం ప్రస్తుతం కరోనాతో సహజీవనం అనే కొత్త నినాదాన్ని ఎంచుకొంది. దీనినే రాష్ట్రాలు కూడా ఫాలో అవుతోన్నాయి. దీంతో కరోనా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వాలు లైట్ తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

    ఇక తెలంగాణలో గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్‌, రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా టెస్టులను ప్రభుత్వం తక్కువ టెస్టులు చేయడంతోనే నేడు పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైందని బీజేపీ ఆరోపిస్తుంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారు. దీనికి ప్రతీగా టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.

    అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

    ఈనేపథ్యంలోనే కేంద్రం బృందం రాష్ట్రానికి నాలుగోసారి రానుండటం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పరిస్థితిపై అధ్యాయనం చేసి కేంద్రానికి నివేదికలను పంపనుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేంద్రం బృందం పర్యటించి ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. తగిన సలహాలు, సూచనలు ఇస్తుంది. ఈ బృందం రాష్ట్రంలోని పరిస్థితి తెలుసుకునేందుకు వ‌స్తోందా లేక‌పోతే బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారును టార్గెట్ చేసేందుకేనా అనే ప్రచారం జరుగుతోంది.

    ఇప్పటికే కేంద్రం బృందం తెలంగాణలో మూడుసార్లు పర్యటించి తగు సూచనలు చేసింది. అయినప్పటికీ కరోనా కేసులు సంఖ్య తగ్గకపోవడంపై మరోసారి పరిశీలన చేయనుంది. ప్రభుత్వం కరోనాపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన కేంద్రానికి నివేదిక అందించనుంది. బీజేపీ రాష్ట్ర నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.