అసలు రంగు బయటపెట్టిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

వైసీపీ ధిక్కార ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిన్న ఢిల్లీ వెళ్లినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఆయన కదలికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు వైసీపీ పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేయడంతో చర్యలకు సిద్ధం అయ్యారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణం రాజు బీజేపీ గూటికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు […]

Written By: Neelambaram, Updated On : June 27, 2020 12:28 pm
Follow us on


వైసీపీ ధిక్కార ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిన్న ఢిల్లీ వెళ్లినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఆయన కదలికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు వైసీపీ పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేయడంతో చర్యలకు సిద్ధం అయ్యారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణం రాజు బీజేపీ గూటికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని నిర్ధారించుకున్న తరువాతే పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

ఓ ప్రక్క వైసీపీ పార్టీ అధినేత జగన్ కి నేను విధేయుడను అని చెవుతూనే..షో కాజ్ నోటీసులపై అనేక అభ్యంతర వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అసలు నాకు షో కాజ్ నోటీసులు ఇచ్చే పద్ధతి ఇదేనా? నోటీసులు పంపడానికి మీరెవరూ? అన్నట్లు ఆయన వాదన సాగింది. ఇక పార్టీ అనుమతి లేకుండా నిన్న ఢిల్లీ వెళ్లిన కృష్ణం రాజు భారత ఎన్నికల కమిషనర్ తో గంటకు పైగా భేటీ అయ్యారు.ఐతే నేడు రఘురామ కృష్ణం రాజు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ని కలవడం మరింత చర్చకు దారితీస్తుంది.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

జగన్ అనుమతి లేకుండా బీజేపీ మంత్రితో ఆయన కలవడంతో వైసీపీతో బంధానికి బై బై చెప్పి, బీజేపీతో దోస్తీ చేయడానికి సిద్ధం అవుతున్నాడన్న సంకేతాలు పంపారు. ఇది వైసీపీకి తెలిసిన అంశమే కావడంతో వారికి పెద్ద ఆశర్యం కలగకపోవచ్చు. అలాగే రఘురామ కృష్ణం రాజు పై సస్పెన్షన్ వేటు పడడంతో పాటు పార్లమెంటు లో కూడా చర్యలు తీసుకునేలా తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇక మనసులో బీజేపీ పంచన చేరాలనే ఉద్దేశం పెట్టుకొని కృష్ణం రాజు వైసీపీ పై ప్రతికూల వ్యాఖ్యలు చేశాడన్న విషయం..స్పష్టం అయ్యింది. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అని తెలుస్తుండగా, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. మొత్తంగా రఘురామ కృష్ణం రాజు మనసు ముసుగు తీశాడు.