KCR: టీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కేసీఆర్ భయపడ్డాడా?

KCR: భయపెట్టడమే కానీ.. భయపడని సీఎం కేసీఆర్ మొదటి సారి వెనకడుగు వేశాడా? ప్రతిపక్ష బీజేపీ విజయం ఊపులో వెనక్కితగ్గాడా? అనువుకాని చోట అధికులం అనరాదని వాయిదా వేశాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు.. టీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ ను బాగా డిస్ట్రబ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ పై విరుచుకుపడుతున్నారు. తన ఫస్ట్రేషన్ ను అంతా బయటపెడుతున్నాడు. ఈ క్రమంలోనే […]

Written By: NARESH, Updated On : November 9, 2021 6:10 pm
Follow us on

KCR: భయపెట్టడమే కానీ.. భయపడని సీఎం కేసీఆర్ మొదటి సారి వెనకడుగు వేశాడా? ప్రతిపక్ష బీజేపీ విజయం ఊపులో వెనక్కితగ్గాడా? అనువుకాని చోట అధికులం అనరాదని వాయిదా వేశాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

KCR (1)

హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు.. టీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ ను బాగా డిస్ట్రబ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ పై విరుచుకుపడుతున్నారు. తన ఫస్ట్రేషన్ ను అంతా బయటపెడుతున్నాడు.

ఈ క్రమంలోనే బీజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. బండి సంజయ్ , విజయశాంతి, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ లు రెచ్చిపోయి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షాక్ నుంచి బయటపడక ముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ తలపెట్టిన విజయగర్జన సభ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా వరంగల్ నగర పరిధిలో దేవన్నపేట శివారులో విజయగర్జన సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈనెల 29న సుమారు 10 నుంచి 12 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ాజరీ చేసింది. దీంతో టీఆర్ఎస్ ప్లీనరీ బహిరంగ సభకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో ఈ సభను వాయిదా వేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.