Boyapati and Ram: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘హీరో రామ్’ కి హ్యాండ్ ఇచ్చాడు. ఆ మధ్య బోయపాటి పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ లు ఇచ్చేవారు. కానీ అఖండకు ముందు బోయపాటి అడిగినా ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. మొత్తానికి బోయపాటి కెరీర్ లోనే అప్పుడు బాగా డౌన్ పీరియడ్ నడిచింది.

అయితే, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్న మిడ్ రేంజ్ హీరోలు అంతా అప్పుడు బోయపాటి వైపు చూశారు. కాకపోతే బోయపాటి వారితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బాలయ్యతో చేస్తున్న “అఖండ” సినిమా ఎలాగూ హిట్ అవుతుంది అనే నమ్మకంతో చాలా ఆఫర్లు వచ్చినా వదిలుకున్నాడు.
కానీ బోయపాటి – రామ్ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో నిర్మాత దిల్ రాజు బాగా కసరత్తులు చేశాడు. హీరో రామ్ కూడా ఎప్పటి నుంచో మాస్ హీరోగా ప్రమోట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. అందుకే, బోయపాటితో సినిమా చేయడానికి రామ్ బాగా ఆసక్తి చూపించాడు. ఈ క్రమంలోనే బోయపాటి రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ రామ్ కి బాగా నచ్చింది.
మొత్తానికి వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి. కానీ అఖండ టీజర్ కూడా రికార్డు వ్యూస్ దక్కించుకోవడం, టీజర్ నచ్చే మరో సినిమా చేద్దాం అంటూ అల్లు అర్జున్ బోయపాటికి ఫోన్ చేయడంతో లెక్క మారిపోయింది.
Also Read: LIGER: యునైటెడ్ స్టేట్స్ లో సందడి చేయనున్న “లైగర్ ” టీమ్
పుష్ప రెండు భాగాలు పూర్తి అయ్యాక, బన్నీ బోయపాటికి డేట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపాడు. దాంతో, ఇప్పట్లో రామ్ తో బోయపాటి సినిమా చేసేలా కనిపించడం లేదు.
Also Read: Shreya: దేవుడిచ్చిన గిఫ్ట్‌తో ఎంజాయ్ చేస్తున్న శ్రియా!