TRS: కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పక్కా వ్యూహం?

TRS: టీఆర్ఎస్, బీజేపీ మద్య విభేదాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలో షాక్ తగలడంతో ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరాటానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తోంది. ఇందిరాపార్క్ వేదికగా కేంద్రంపై పోరు చేసేందుకే నిర్ణయించుకుంది. దీనికి గాను అన్ని ఆయుధాలు రెడీ చేసుకుంటోంది. మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచుతూ ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ఈనెల 29 నుంచి జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు […]

Written By: Srinivas, Updated On : November 28, 2021 4:45 pm
Follow us on

TRS: టీఆర్ఎస్, బీజేపీ మద్య విభేదాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలో షాక్ తగలడంతో ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరాటానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తోంది. ఇందిరాపార్క్ వేదికగా కేంద్రంపై పోరు చేసేందుకే నిర్ణయించుకుంది. దీనికి గాను అన్ని ఆయుధాలు రెడీ చేసుకుంటోంది. మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచుతూ ఇరుకున పెట్టాలని భావిస్తోంది.

TRS

ఈనెల 29 నుంచి జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రంలో కాలు దువ్వుతున్నా పలు సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను పార్టీ ఎంపీలకు సూచనలు చేసినట్లు సమాచారం.

Also Read: హైద‌రాబాద్ లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌

పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై నిలదీసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నదీ జలాల వివాదం, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విడుదల తదితర అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి గాను పార్టీ ఎంపీలకు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ శనివారం ఓ ప్రకటన చేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో రాష్ర్ట ప్రభుత్వాన్ని బాధ్యతగా చూపించడంతో టీఆర్ఎస్ మండిపడుతోంది. కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై దాడి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం.

Also Read: ఢిల్లీ టూర్‌తో ఫెయిల్ తో మౌనంగా సీఎం.. కొత్త ప్లాన్ ఏంటి ?

Tags