https://oktelugu.com/

సాగర్ టీఆర్ఎస్ దే.. బీజేపీ డిపాజిట్ గల్లంతు

నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18449 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 21 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి తన ప్రత్యర్థి, కాంగ్రెస్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 2, 2021 / 02:56 PM IST
    Follow us on

    నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

    దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే.

    టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 21 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి తన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత జానారెడ్డిపై 15487 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు 74726 ఓట్లు, కాంగ్రెస్ కు 59239 ఓట్లు, బీజేపీకి 6365 ఓట్లు పోలయ్యాయి.

    సాగర్ లో మొత్తంగా జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీకి సాగర్ లో డిపాజిట్ కోల్పోవడం తీరని అవమానంగా మారింది.