గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ పోస్టుమార్టం.. చివరకు తేలిందెంటీ?

గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు ఖాయమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎవరీ మద్దతు లేకుండానే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలుపుకున్న మేయర్ పీఠాన్ని దక్కించుకోలేని స్థితిలోకి టీఆర్ఎస్ వెళ్లింది. Also Read: ఆ ఒక్కడే చేయగలడు.. కేసీఆర్ పై ఓవైసీ హాట్ కామెంట్స్ గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ లో పోస్టుమార్టం మొదలైంది. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ముందుస్తు […]

Written By: Neelambaram, Updated On : December 5, 2020 3:32 pm
Follow us on

గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు ఖాయమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎవరీ మద్దతు లేకుండానే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలుపుకున్న మేయర్ పీఠాన్ని దక్కించుకోలేని స్థితిలోకి టీఆర్ఎస్ వెళ్లింది.

Also Read: ఆ ఒక్కడే చేయగలడు.. కేసీఆర్ పై ఓవైసీ హాట్ కామెంట్స్

గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ లో పోస్టుమార్టం మొదలైంది. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ముందుస్తు వ్యూహంతో ఎన్నికలు వెళ్లారు. అయితే ఫలితం మాత్రం విపక్షాలకు అనుకూలంగా రావడంపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. డివిజన్లకు ఇన్ ఛార్జులుగా ఉన్న మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెల్సింది.

కనీసం కార్పొరేటర్లను కూడా గెలిపించుకోలేరా? అంటూ మంత్రులపై సీఎం గరం అయ్యారట. ఇక మంత్రి కేటీఆర్ ఫలితాలపై ఇచ్చిన వివరణపై కూడా మండిపడినట్లు సమాచారం. గ్రేటర్లో వరద సాయం పంపిణీ చేసిన డివిజన్లలోనూ వ్యతిరేక ఫలితాలు రావడంపై మంత్రులను నిలదీసినట్లు సమాచారం.

వంద సీట్లు సాధించామని చెప్పుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షాలతోపాటు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కేసీఆర్ వాపోయినట్లు తెలుస్తోంది. అయితే గ్రేటర్లలో పేద, ఉద్యోగుల నుంచి టీఆర్ఎస్ కు పెద్దగా మద్దతు లభించలేదని అంచనా వేసుకుంటున్నారు. అలాగే వరదసాయం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశం కూడా ప్రతికూలంగా మారినట్లు తేలిందట.

Also Read: కమలం వైపే కాంగ్రెస్‌ క్యాడర్!

గ్రేటర్లో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలంటే అనివార్యంగా ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సి వస్తోంది. ఎంఐఎంతో పోత్తు లేదని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఆ పార్టీ మద్దతు తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని భావిస్తున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్-ఎంఐఎంలు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరనుంది. దీంతో గులాబీ బాస్ మంత్రులపై గరగరం అవుతున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే మేయర్ పీఠం కోసం ఇప్పటికే పలువురు అభ్యర్థులు లాబీయింగ్ మొదలుపెట్టారు. దీంతో గులాబీ బాస్ ఎవరినీ మేయర్ గా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్