Homeజాతీయ వార్తలుTRS MLA Shankar Naik: మందేసి చిందేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

TRS MLA Shankar Naik: మందేసి చిందేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

TRS MLA Shankar Naik:హోలీ.. కుల మతాలకు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా జరుపుకునే పండుగ. విభిన్న రీతులు.. వివిధ సంస్కృత, సంప్రదాయాలు.. పండుగ జరుపుకునే తీరు వేరు అయినా.. పండుగ జరుపుకోవడం మాత్రం ఘనమే. జీవితంలోని కష్టాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఆప్యాయతలు, అనురాగాలకు ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో హోలీ పండుగ కళ తప్పింది. ఈ ఏడాది కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడం, 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో శుక్రవారం హోలీ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, హోదాతో సంబంధం లేకుండా అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అందరిలా రంగులు పూసుకుంటే ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారో ఏమో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఈ ఏడాది హోలీ పండుగను సరికొత్తగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా తన ఇంటికి వచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులకు శంకర్‌నాయక్‌ మద్యం పంపిణీ చేపట్టారు. కొంతసేపు నాయకులతో రంగులు చల్లుకున్న ఎమ్మెల్యే తర్వాత తానే స్వయంగా మందుబాటిల్‌ ఎత్తారు.

Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?

తన నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులకు మందు స్వయంగా నోట్లో పోశారు. తెరవరా నోరు… పోయరా మందు అంటూ గట్టిగా అరుస్తూ నృత్యం చేస్తూ మద్యం నోట్లో పోశారు. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం అమ్మకాలనే నమ్ముకుంది అనే విమర్శలు వ్యక్తమవుతుంటే..

తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మాంసం తిన్న తర్వాత బొక్కలు మెడలో వేసుకున్న చందంగా తన అనుయాయులకు మందు పోస్తూ వివాదాస్పదమయ్యారు. అంతటితో ఆగకుండా.. చాలా మందికి మందు బాటిళ్లు కూడా పంపిణీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వం మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించింది.

ఏటా హోలీ పండుగ సందర్భంగా గొడవలు జరుగుతున్నాయని ఇంటలిజెన్స్‌ అందించిన నివేదికతో ప్రభుత్వం మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించింది. కానీ ఎక్కడా ఆ ఆదేశాలు అమలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకున్నాయి. రోజువారీ విక్రయాలకంటే శుక్రవారం ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. టీఆర్‌ఎస ఎమ్మెల్యేనే స్వయంగా మద్యం కొనుగోలు చేసి పంపిణీ చేయడం.. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తన క్యాడర్‌ను మచ్చిక చేసుకునేందుకే శంకర్‌నాయక్‌ ఇలా మద్యం పంపిణీ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: TDP Twitter Account Hacked: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులతో షాకిచ్చిన హ్యాకర్లు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

4 COMMENTS

  1. […] Dreams:  మనం నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజంగానే జరుగుతాయని చాలా మంది భావిస్తారు. మరికొందరు మాత్రం ట్రాష్ అని కొట్టిపారేస్తారు. అయితే మనకు నిద్రలో వచ్చే కలల వెనుక మన జీవితానికి సంబంధించిన విషయాలు దాగి ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే కొన్ని కలలు శుభాన్ని కలిగిస్తే.. మరికొన్ని కలలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వారు వివరిస్తున్నారు. […]

  2. […] Mohan babu Birth Day: మోహన్ బాబు.. తెరపై విలక్షణ నటుడు. కలెక్షన్ కింగ్. తన నటనతో నవ్వించడమూ తెలుసు.. ఏడిపించడమూ తెలుసు. నటుడిగా.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. నిర్మాతగా.. విద్యావేత్తగా.. రాజకీయ నాయకుడిగా.. ఇలా అన్ని చవిచూసి మెప్పించిన నటుడు ఆయన. 47 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహన్ బాబు ఎంతో కష్టపడి పైకి ఎదిగారు. కష్టం విలువ తెలిసిన నటుడు ఆయన. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు భక్సవత్సలం నాయుడు. ఆ తర్వాతే దాసరి నారాయణ రావు దయతో ‘మోహన్ బాబు’గా మారాడు. […]

  3. […] IT Minister KTR To Visit US: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా పరిశ్రమలు తరలివచ్చేందుకు కూడా సహకరిస్తోంది. దీంతో రాష్ర్టంలో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తోంది. దీనికి గాను అక్కడి ప్రతినిధుల్ని ఒప్పించేందుకు పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందంతో అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఈనెల 29 వరకు తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటించి వారితో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. […]

  4. […] Age Relaxation: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేటకు 81 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించారు. ఇక ఈ పోస్టుల భర్తీ విషయంపై బిజీ అయింది టీఎస్‌పీఎస్సీ. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఇక ఇదే టైంలో చాలా మంది నిరుద్యోగుల ఏజ్ బార్ అయిపోయింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular