TRS vs BJP: తగ్గేదే లే.. ఢిల్లీ చలిలో వేడి పుట్టిస్తున్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు

TRS vs BJP:  తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో సున్నా డిగ్రీలకు చేరుతున్న చలిలోనూ మేం వెనక్కి తగ్గమని అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై చర్చించేందుకు రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఎట్టకేలకు సమావేశమయ్యారు. అటు ప్రధాని, ఇటు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా రెండు రోజులపాటు టీఆర్ఎస్ బృందానికి చుక్కలు చూపారు. […]

Written By: NARESH, Updated On : December 22, 2021 12:00 pm
Follow us on

TRS vs BJP:  తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో సున్నా డిగ్రీలకు చేరుతున్న చలిలోనూ మేం వెనక్కి తగ్గమని అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై చర్చించేందుకు రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఎట్టకేలకు సమావేశమయ్యారు. అటు ప్రధాని, ఇటు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా రెండు రోజులపాటు టీఆర్ఎస్ బృందానికి చుక్కలు చూపారు.

TRS vs BJP

తాజాగా ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ చాంబర్ లో ఆహార మంత్రితో భేటి అయ్యారు. వానాకాలం ధాన్యం మొత్తం కొనాలన్న మంత్రులు, యాసంగి ధాన్యం కొనుగోలుపైనా స్పష్టత కోరారు. సేకరించే ధాన్యానికి సంబంధించి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని కేంద్రమంత్రి చెప్పినట్టు సమాచారం.

ఇక తెలంగాణ నుంచి సేకరించే బియ్యంపైనా కేంద్రాన్ని స్పష్టత కోరారు టీఆర్ఎస్ బ్యాచ్. అయితే దానిపైన కూడా పీయూష్ గోయల్ క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.

Also Read: బాప్ రే.. తెలంగాణ రాష్ట్రంపై ఇన్ని అప్పులా? తెలిస్తే షాక్ అవుతారు

ఇక తెలంగాణలో ధాన్యం సేకరించాలా? వద్దా? అన్న దానిపై కూడా కేంద్ర ఆహార మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలా? మూసివేయాలా? కూడా చెప్పకపోవడం గమనార్హం.

దీంతో వీటన్నింటిపై ఏ విషయం చెబితేనే తాము ఢిల్లీ వదిలి హైదరాబాద్ వెళతామని టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు భీష్మించారు. దీంతో ఈ ధాన్యం కొనుగోళ్ల ఫైట్ యమ రంజుగా మారింది. కేంద్రం తలొగ్గకపోవడం.. టీఆర్ఎస్ వెనక్కి తగ్గకపోవడంతో ఈ ఫైట్ ఎటు దారితీస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Also Read: బాప్ రే.. తెలంగాణ రాష్ట్రంపై ఇన్ని అప్పులా? తెలిస్తే షాక్ అవుతారు