జాతీయ వార్తలుచిరుతో ఈటల భేటీ..: ఏంటీ రహస్యం

చిరుతో ఈటల భేటీ..: ఏంటీ రహస్యం

Etela Meets Chiranjeevi
ఒకాయన మొన్నటి వరకు రాజకీయాల్లో తిరిగి.. ఇప్పుడు మళ్లీ సినీ గూటికి చేరిన హీరో. ఇంకో ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ మంత్రి. ఇప్పుడీ ఇద్దరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. టీఆర్‌‌ఎస్‌ కీలక నేత, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌‌, మరికొందరు నేతలతో కలిసి మెగాస్టార్‌‌ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనతో ఏకాంతంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల చిరు ఇంటికి ఎందుకు వెళ్లారని ఎవరికీ అంతుబట్టని అంశం. అయితే.. రాజకీయ కోణంలో ఎందుకు చూడాలన్న మాట మరికొందరి నోట వినిపిస్తోంది.

Also Read: టీడీపీ నిధుల వేట..: ముందుకు రాని క్యాడర్‌‌

తన జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన కళాకారులు.. నిరుద్యోగ యువతకు సినీ పరిశ్రమలో ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈటల కోరినట్లుగా చెబుతున్నారు. మంత్రి ఈటల మాటకు చిరు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈటలతోపాటు బండ శ్రీనివాస్.. తుమ్మేటి సమ్మిరెడ్డి తదితరులు ఉన్నారు.

తన జిల్లాలోని ఒక ప్రాంతానికి చెందిన కళాకారుల కోసం మంత్రిఈటల చిరు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న సైతం బలంగా వినిపిస్తోంది. ఆయనకు సొంతంగా స్టూడియో లేదు. నిర్మాణ సంస్థ మాత్రమే ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించటానికి చిరు ఏమీ కీలక స్థానంలో లేరు. గతంలో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి అవసరమై ప్లాట్ ఫాం లేదు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

అలాంటప్పుడు.. ఈటల భేటీ వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి.. ఈటల కోరితే చిరునే నేరుగా వచ్చి కలిసే వారేమో. అలాంటప్పుడు.. తాజా భేటీ ఎందుకు? అన్నది అందుబట్టడం లేదు. ఇదిలా ఉంటే.. సీఎం మార్పుపై కొంతకాలంగా (ఆదివారం కేసీఆర్ తేల్చేశారునుకోండి) జరుగుతున్న చర్చ నేపథ్యంలో చిరును కలిశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. చిరు ఇంటికి మంత్రి ఈటల వెళ్లడం.. ఏకాంత భేటీ కావడం మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Etela Bandi Meeting: ఈటల, బండి అలయ్ బలయ్: కార్యకర్తలు ఏం తెలుసుకోవాలంటే..

Etela Bandi Meeting: రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తారు. వాళ్లకు అనుకూలమైన పనులు మాత్రమే చేస్తారు. అంటే తప్ప కార్యకర్తల అభీష్టానికి నడుచుకోరు. రాజకీయాలు అంటే సేవ కాదు. అది ఒక...

Chiranjeevi: చిరంజీవి లైనప్ లో భారీ మార్పులు చేశారు కదా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అలాంటి గొప్ప నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Exit mobile version