https://oktelugu.com/

నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ కీలక భేటి.. మేయర్ పై తేల్చేస్తారా?

గ్రేటర్లో ఎవరీ మద్దతు లేకుండానే మేయర్ పీఠం దక్కించుకుంటామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. అయితే టీఆర్ఎస్ కు గ్రేటర్ వాసులు ఊహించని షాకిచ్చారు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు 55.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు 2సీట్లు ఇచ్చారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. Also Read: ‘గ్రేటర్’ ఎఫెక్ట్.. బీజేపీలోకి క్యూ కడుతున్న నేతలు..! గ్రేటర్లో టీఆర్ఎస్ కు అన్ని పార్టీల కంటే అత్యధికంగా ఎక్స్ అఫీషియో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 6, 2020 12:17 pm
    Follow us on

    ktr

    గ్రేటర్లో ఎవరీ మద్దతు లేకుండానే మేయర్ పీఠం దక్కించుకుంటామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. అయితే టీఆర్ఎస్ కు గ్రేటర్ వాసులు ఊహించని షాకిచ్చారు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు 55.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు 2సీట్లు ఇచ్చారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.

    Also Read: ‘గ్రేటర్’ ఎఫెక్ట్.. బీజేపీలోకి క్యూ కడుతున్న నేతలు..!

    గ్రేటర్లో టీఆర్ఎస్ కు అన్ని పార్టీల కంటే అత్యధికంగా ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను కలుపుకున్నా టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ ఇతరుల మద్దతుతోనే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలోనే నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ కీలక భేటి నిర్వహిస్తోంది.

    గ్రేటర్లోని గెలిచిన కార్పొరేటర్లు.. స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఫలితాలపై చర్చించనున్నారు. పనిలో పనిలోగా ఎంఐఎంతో పొత్తు లేదా మద్దతు.. మేయర్ ఎంపిక వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ భేటి జరుగుతుండటం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: టీపీసీసీ చీఫ్.. చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు

    2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించింది. అయితే 2020 ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ 55 సీట్లకు పడిపోయింది. సీట్ల సంఖ్య తగ్గడానికి గల కారణాలు.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే మున్ముందు వచ్చే ఇబ్బందులపై సమీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవీ ఇంకా రెండు నెలల పదవీ కాలం ఉండటంతో మేయర్ ఎంపిక ఈ భేటిలో తేలుస్తారా? లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్