https://oktelugu.com/

పెళ్లి కుమార్తెగా నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు !

మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. శనివారం ఆమెను పెళ్లి కూతుర్ని చేశారు. కాగా పెళ్లి కుమార్తెగా ముస్తాబైన నిహారిక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో హీరో వరుణ్‌తేజ్‌ పంచుకున్నారు. స్నేహితులతో నిహారిక దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇక పెళ్లి కూతురు ఫంక్షన్‌కి దాదాపుగా మెగా కుటుంబమంతా హాజరయ్యారు. స్వగృహంలోనే ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. Also Read: ప్రభాస్ సినిమా పై సైఫ్ అలీ […]

Written By:
  • admin
  • , Updated On : December 6, 2020 / 10:53 AM IST
    Follow us on


    మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. శనివారం ఆమెను పెళ్లి కూతుర్ని చేశారు. కాగా పెళ్లి కుమార్తెగా ముస్తాబైన నిహారిక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో హీరో వరుణ్‌తేజ్‌ పంచుకున్నారు. స్నేహితులతో నిహారిక దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇక పెళ్లి కూతురు ఫంక్షన్‌కి దాదాపుగా మెగా కుటుంబమంతా హాజరయ్యారు. స్వగృహంలోనే ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు.

    Also Read: ప్రభాస్ సినిమా పై సైఫ్ అలీ ఖాన్ క్రేజీ కామెంట్స్ !

    ఈ సందర్భంగా తీసిన ఫొటోను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. ఆ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఫోటోలో నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో కళకళలాడారు. వరుణ్‌ తేజ్‌ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటున్నారట. కాగా గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను నిహారిక డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మనువాడబోతున్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ శుభకార్యానికి వేదిక కాబోతోంది.

    Also Read: కొమ్మారెడ్డి సావిత్రి.. అందుకే మహానటీమణి అయింది !

    ఇక వీరి పెళ్లి పై అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ప్రేమ వివాహం కాదట. పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అలాగే గత కొన్ని రోజులుగా ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. ఇక నిహారికకు కాబోయే వరుడు చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారని.. ఆయన జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారని.. అలాగే బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ కూడా చేశారని తెలుస్తోంది. ఇక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివాక, హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా ప్రస్తుతం చైతన్య పనిచేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్