
TRS vs BJP: హుజూరాబాద్ ఎన్నికలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. టీఆర్ ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎదురెదెరుగా వచ్చినప్పుడు ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. తాజాతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలో కూడా ఇలాగే జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇల్లందకుంట మండలంలో సిరినేడు గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ రోడ్ షో నిర్విహిస్తున్నారు. అదే క్రమంలో అటు దిక్కు నుంచి టీఆర్ ఎస్ నాయకులు ర్యాలీ చేపడుతున్నారు. ఇరు పార్టీల నాయకులు ఎదురెదురుగా చేరుకున్నారు. టీఆర్ ఎస్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు తమ ప్రత్యర్ధి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది ముదిరి ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ క్రమంలో ఎస్సైపై ఎవరో చేసుకోవడంతో ఇది మరింత ముదిరిపోయింది. దీనిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో శాంతి వాతావరణం నెలకొంది. అనంతరం రెండు పార్టీల ర్యాలీలు సజావుగా వెళ్లిపోయాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు ఉండగానే.. ఇలాంటి పరిస్థితులు వస్తే.. సమీపంలోకి వచ్చే కొద్దీ ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అని హుజూరాబాద్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు.