TRS: కొత్త పార్టీ పెడతారా? గుడ్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో దరఖాస్తు చేయండి. ఆ పేరుతో ఏ పార్టీ కూడా ఉనికి లో లేదు. అదృష్టం బాగుండి, రోడ్డు రోలర్, జీపు వంటి గుర్తులు దొరికితే ఇంకా సూపర్..ఏమో, బిజెపి వాళ్లే మంచి ప్యాకేజీ మాట్లాడి మరీ ఎంకరేజ్ చేయవచ్చు. వాళ్లు ఎలాగూ తమ కార్యకర్తలతో ఈ పేరుతో కొత్త పార్టీ పెట్టించే ఆలోచన చేయరు.. వాళ్లవన్నీ ఇప్పుడు కొనుగోళ్ల స్కీములే. ఆ అమిత్ షా మాట విని ఈటల రాజేందర్ అదే చేస్తున్నాడు. గజ్వేల్ లో వారానికి ఒక్కసారైనా పర్యటిస్తున్నాడు. అప్పట్లో అంటే టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు గులాబీ పార్టీకి మేమే ఓనర్లమని చెప్పాడు. ఇప్పుడు దానిని నిజం చేసుకునే టైం కూడా వచ్చింది. ఏముంది అలా దరఖాస్తు చేస్తే ఇలా పార్టీ పెట్టవచ్చు. రేపు ఎలాగూ అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు కనుక వేడి నీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉంటాయి కాబట్టి కచ్చితంగా బీజేపీ కి ఇంకొక బీ పార్టీ అంటూ ఉండాల్సిందే.

కెసిఆర్ వద్దనుకుంటున్నారు కాబట్టి
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కెసిఆర్ వదులుకున్నారు. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ అనే పార్టీ లేకుండా పోయింది.. ఇతరులు టిఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. టీ ఆర్ ఎస్ పేరు లేదు కాబట్టి ఎవరైనా రిజిస్టర్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతకాలం తర్వాత ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారికి ఆ పేరు కేటాయిస్తారు. లేదంటే కొత్తగా పార్టీ పెట్టుకునేవారు ఆ పేరుతో ప్రారంభించుకోవచ్చు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజలకు ఒక బ్రాండ్ లాంటిది. అది వారి ఇంటి పార్టీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జాతీయ లక్ష్యాలతో కెసిఆర్ ఆ పార్టీని వదిలేసుకున్నారు.

ఎలా ఉంటుంది
ఇతరుల చేతుల్లోకి టిఆర్ఎస్ వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ… టిఆర్ఎస్ అంటే కేసీఆర్ అని… కెసిఆర్ లేని టిఆర్ఎస్ పార్టీకి ఒక ఉనికి ఉండదని బీఆర్ఎస్ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పేరు ఒకటే మారింది. అదే గులాబీ రంగు. ఎన్నికల గుర్తు ఎలాగూ మారదు. అందుకే టిఆర్ఎస్ పేరును ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కెసిఆర్ ఎలాగూ వదిలేసారు కాబట్టి వచ్చే రోజుల్లో టిఆర్ఎస్ పేరుతో జరిగే రాజకీయాలకు కొదవ ఉండదు. కెసిఆర్ కు కూడా కావాల్సింది ఇలాంటివే.. ఇలా అయితేనే ఓట్లు చీలుతాయి. తనకు లాభం జరుగుతుంది. ఇవన్నీ తెలియకుండా కేసీఆర్ పార్టీ పేరు మార్చారు అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు.