Homeజాతీయ వార్తలుTRS Foundation Day: ఏప్రిల్ 27వ టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. కేసీఆర్ మళ్లీ ఏం చేస్తారో?

TRS Foundation Day: ఏప్రిల్ 27వ టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. కేసీఆర్ మళ్లీ ఏం చేస్తారో?

TRS Foundation Day: టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలకు ఆహ్వానం పంపనున్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ కార్యక్రమాలు, తీర్మానాలు తయారు చేస్తున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఇందులో నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.

TRS Foundation Day
TRS

పదింటికల్ల నేతలందరు చేరుకోవాలని చెబుతున్నారు. 10 నుంచి 11 గంటల వరకు ప్రజాప్రతినిధుల సభ్యత్వ నమోదు, 11.05 గంటలకు కేసీఆర్ ప్రసంగం ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అవలంభించబోయే వ్యూహాలపై సీఎం కేసీఆర్ నేతలకు తెలియజేయనున్నట్లు సమాచారం.

Also Read: Shah Jahan: సండే స్పెషల్: షాజహాన్ కన్న కూతురిని కూడా వదలలేదా..? సంచలన నిజాలివీ

మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యే పోటీ ఉండనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని తేలిపోతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ మేరకు నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ భవితవ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కేసీఆర్ ఇదే వేదికగా పలు నిర్ణయాలు వెలువరించనున్నట్లు చెబుతున్నారు.

TRS Foundation Day
TRS Foundation Day

ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుబందు, దళితబందు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్లు అన్నింటిపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ధీటైన ప్రతిపక్షం లేకపోవడంతో విజయం తమదేననే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. కానీ బీజేపీ చాపకింద నీరులా టీఆర్ఎస్ సీట్లను కొల్లగొడుతుందనే భయం వారిలో ఏర్పడింది. దీంతో వారికి అవకాశం ఇవ్వకుండా చేయడానికే కేసీఆర్ పాచికలు వేస్తారనే ప్రచారం సాగుతోంది.

Also Read:SS Rajamouli RRR Movie: ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి చేసిన బిగ్ మిస్టేక్స్ ఇవే.. తాజాగా ‘కొమ్మ ఉయ్యాల’ పాటలోనూ పెద్ద తప్పు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

3 COMMENTS

  1. […] Best Smartphones: ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌లో స్మార్ట్ ఫోన్ అనేది కంప‌ల్సీర అన్న‌ట్టు మారిపోయిది. ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే క‌నిపిస్తున్నాయి. అయితే మిడిల్ క్లాస్ వారికి ఎక్కువ‌గా మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ లు కావాలి. చాలా మంది రూ.20,000లోపు మొబైల్ ఫోన్లు కావాల‌ని అనుకుంటారు. ఇందులో ఏయే మోడ‌ల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మొబైల్స్‌లో ఈ మ‌ధ్య ఫీచ‌ర్లు కూడా చాలానే వ‌చ్చాయి. మ‌రి అందులో ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. […]

  2. […] AP Politics: అసలు రాష్ట్రంలో ఎన్నికలంటూ లేవు. కానీ రేపో మాపో ఎన్నికలు జరుగుతున్న హడావుడి కనిపిస్తోంది. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు, పర్యటనలతో అధికార పార్టీ నాయకులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రజాప్రతినిధుల దర్పంతో సామాన్య ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరీ ముఖ్యంగా కొత్తగా మంత్రులైన వారు చేస్తున్న ఓవర్ యాక్షన్ పై ప్రజలు నివ్వెరపోతున్నారు. భారీ స్వాగతాలు, సత్కారాలు, అభినందనలు, సభలు, సమావేశాలు, పర్యటనలు, ఆలయాల సందర్శనలతో సామాన్య ప్రజా జీవితానికి అసౌకర్యానికి గురి చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట సీఎం జగన్ విశాఖ పర్యటనలో నగరవాసులు, ఇటు విమాన ప్రయాణికులు పడిన వెతలు తెలిసిందే. అప్పట్టో తనకిష్టమైన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి దర్శనానికి జగన్ విశాఖ వచ్చారు. అప్పట్లో గాజువాక నుంచి స్వామివారి ఆశ్రమం వరకూ ట్రాఫిక్ ను నిలిపివేశారు. […]

  3. […] Internal Conflicts In YCP: ఏ ముహూర్తాన సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారో కానీ.. అప్పటి నుంచి అధికార వైసీపీలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య అగాధం ఏర్పడింది. మంత్రి పదవులు పోగొట్టుకున్న వారు, అవకాశం దక్కని ఎమ్మెల్యేలు, ఆశావహులు ఆగ్రహంతో ఉన్నారు. కొనసాగింపు లభించిన పాత మంత్రులు, కొత్తగా అవకాశం దక్కించుకున్న వారిపై గుర్రుగా ఉన్నారు. బహిరంగగానే తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన క్రిష్టదాస్ అమాత్య పదవి పోగొట్టుకున్నారు. ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారాం అమాత్య పదవిని ఆశించి భంగపడ్డారు. దీంతో అటు తమ్మినేని, ఇటు ధర్మాన క్రిష్టదాస్ అసంత్రుప్తితో రగిలిపోతున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular